తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను
(॥పల్లవి॥)
తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను
నేనేమైనా తనమీఁద నెపాలు వేసేనా
(॥తానె॥)
రతివేళమాఁటలు రచ్చలకు నెక్కవు
యితవైనవారికి యెగ్గులేదు
పతికిని సతికిని పాయదు చుట్టరికము
అతిమోహములకును అడ్డాఁకలేదు
(॥తానె॥)
సిగ్గువడ్డయంతలోనే చేరదు తమకము
వెగ్గళించినా నవ్వులు వేసటగావు
వొగ్గి వేఁడుకొంటేనే వోదు గదు బీరము
కగ్గనిపొందులలోన కపటము లుండవు
(॥తానె॥)
చనవరిచేఁతలు సాదింపులు గావు
యెనసినకూటమికి నెర వేడది
ఘనశ్రీవేంకటేశుఁడు కదిసె నన్నింతలొనె
వినయముగలచోట వెగటై తోఁచదు
(||pallavi||)
tā nĕram̐gam̐ḍā yīdagavu lĕllĕḍalanu
nenemainā tanamīm̐da nĕbālu vesenā
(||tānĕ||)
radiveḽamām̐ṭalu rachchalagu nĕkkavu
yidavainavārigi yĕgguledu
padigini sadigini pāyadu suṭṭarigamu
adimohamulagunu aḍḍām̐kaledu
(||tānĕ||)
sigguvaḍḍayaṁtalone seradu tamagamu
vĕggaḽiṁchinā navvulu vesaḍagāvu
vŏggi vem̐ḍugŏṁṭene vodu gadu bīramu
kagganibŏṁdulalona kabaḍamu luṁḍavu
(||tānĕ||)
sanavarisem̐talu sādiṁpulu gāvu
yĕnasinagūḍamigi nĕra veḍadi
ghanaśhrīveṁkaḍeśhum̐ḍu kadisĕ nanniṁtalŏnĕ
vinayamugalasoḍa vĕgaḍai tom̐sadu