Taa neṟamgadaa yee tagavulellaa

తా నెఱఁగడా యీ తగవులెల్లా
Language

(॥పల్లవి॥)
తా నెఱఁగడా యీ తగవులెల్లా
వీనులకు నింపుగాను విన్నవించఁగదరే

(॥తానె॥)
సేసవెట్టి పెండ్లాడి చెలియను మగవాఁడు
వేసటతోఁ బెడవాడ వేయఁదగునా
అసకొలిపి రప్పించి యాపె నంతలో మొఱగి
పోసరించి వేరొక్కతెఁ బొందఁదగునా

(॥తానె॥)
చిట్టంటుచేఁత చేసి చేతికి విడెమిచ్చి
గుట్టుతోఁ బరాకు సేసుకొనఁదగునా
అట్టె సరసములు తా వాడుతా నేఁ జూడఁగానే
నట్టనడుమ నాపెతో నగఁదగునా

(॥తానె॥)
తాలిమితో నాకాఁగిటఁ దగిలి పెనఁగుతానే
లాలించి యెవ్వతెనో తలఁచఁదగునా
ఆలించి శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
మేలువాఁడు నాకుఁ దాను మితిమీరఁదగునా

(||pallavi||)
tā nĕṟam̐gaḍā yī tagavulĕllā
vīnulagu niṁpugānu vinnaviṁcham̐gadare

(||tānĕ||)
sesavĕṭṭi pĕṁḍlāḍi sĕliyanu magavām̐ḍu
vesaḍadom̐ bĕḍavāḍa veyam̐dagunā
asagŏlibi rappiṁchi yābĕ naṁtalo mŏṟagi
posariṁchi verŏkkadĕm̐ bŏṁdam̐dagunā

(||tānĕ||)
siṭṭaṁṭusem̐ta sesi sedigi viḍĕmichchi
guṭṭudom̐ barāgu sesugŏnam̐dagunā
aṭṭĕ sarasamulu tā vāḍudā nem̐ jūḍam̐gāne
naṭṭanaḍuma nābĕdo nagam̐dagunā

(||tānĕ||)
tālimido nāgām̐giḍam̐ dagili pĕnam̐gudāne
lāliṁchi yĕvvadĕno talam̐sam̐dagunā
āliṁchi śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
meluvām̐ḍu nāgum̐ dānu midimīram̐dagunā