తా నెక్కడ నే నెక్కడ తగిలీఁ దాను
(॥పల్లవి॥)
తా నెక్కడ నే నెక్కడ తగిలీఁ దాను
వూని నన్ను వేఁడుకొనీ నోయమ్మ తాను
(॥తానె॥)
వొద్ద వచ్చి కూచుండి వొంటి నుండఁగా నన్ను
సుద్దులడిగీ నెంత చుట్టమే తాను
చద్దికి వేఁడికి వట్టి సన్న లూరకే సేసీ
వొద్దన్నా మానఁడు గదే వోయమ్మ తాను
(॥తానె॥)
పక్కన మోము చూచి పయ్యద జారితేను
చక్కఁ బెట్టీ నెంత యిచ్చకుండే తాను
చిక్కించుక యేకతము చెప్పేనంటాఁ జెవిలోన
వొక్కొక్కమాఁటే యాడీ నోయమ్మతాను
(॥తానె॥)
పూఁచి శ్రీ వేంకటేశుఁడు బోదించి బోదించి
రేఁచీ వావు లెంత మేనరికమే తాను
ఆఁచి కాఁగిలించి కూడి అంగడిఁబెట్టీ సిగ్గులు
వూఁచఁడు వాఁచఁడు సూడు వోయమ్మతాను
(||pallavi||)
tā nĕkkaḍa ne nĕkkaḍa tagilīm̐ dānu
vūni nannu vem̐ḍugŏnī noyamma tānu
(||tānĕ||)
vŏdda vachchi kūsuṁḍi vŏṁṭi nuṁḍam̐gā nannu
suddulaḍigī nĕṁta suṭṭame tānu
saddigi vem̐ḍigi vaṭṭi sanna lūrage sesī
vŏddannā mānam̐ḍu gade voyamma tānu
(||tānĕ||)
pakkana momu sūsi payyada jāridenu
sakkam̐ bĕṭṭī nĕṁta yichchaguṁḍe tānu
sikkiṁchuga yegadamu sĕppenaṁṭām̐ jĕvilona
vŏkkŏkkamām̐ṭe yāḍī noyammadānu
(||tānĕ||)
pūm̐si śhrī veṁkaḍeśhum̐ḍu bodiṁchi bodiṁchi
rem̐sī vāvu lĕṁta menarigame tānu
ām̐si kām̐giliṁchi kūḍi aṁgaḍim̐bĕṭṭī siggulu
vūm̐sam̐ḍu vām̐sam̐ḍu sūḍu voyammadānu