చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
పల్లవి:
చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా
చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా
కళ్ళ ముందు కటిక నిజం కాన లేని గుడ్డి జపం
సాధించదు ఈ పరమార్థం బ్రతుకుని కానీయకు వ్యర్థం
సాధించదు ఈ పరమార్థం బ్రతుకుని కానీయకు వ్యర్థం
చరణం 1:
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూసి జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మర్చేదా సంప్రదాయం అంటే
కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మర్చేదా సంప్రదాయం అంటే
చరణం 2:
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాట గానే
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాట గానే
pallavi:
suṭṭū pakkala sūḍarā sinna vāḍā
sukkallo sūbu sikkugunna vāḍā
suṭṭū pakkala sūḍarā sinna vāḍā
sukkallo sūbu sikkugunna vāḍā
kaḽḽa muṁdu kaḍiga nijaṁ kāna leni guḍḍi jabaṁ
sādhiṁchadu ī paramārdhaṁ braduguni kānīyagu vyardhaṁ
sādhiṁchadu ī paramārdhaṁ braduguni kānīyagu vyardhaṁ
saraṇaṁ 1:
svargālanu aṁdugŏnālani vaḍigā guḍi mĕṭlĕkkevu
sāḍi maniṣhi vedana sūsi jāli leni śhilavaināvu
karuṇanu maribiṁchedā saduvū saṁskāraṁ aṁṭe
guṁḍĕ baṁḍagā marsedā saṁpradāyaṁ aṁṭe
karuṇanu maribiṁchedā saduvū saṁskāraṁ aṁṭe
guṁḍĕ baṁḍagā marsedā saṁpradāyaṁ aṁṭe
saraṇaṁ 2:
nuvvu tine pradi ŏga mĕdugu ī saṁghaṁ paṁḍiṁchiṁdi
garviṁche ī nī bradugu ī samājame malasiṁdi
ruṇaṁ tīrsu taruṇaṁ vaste tappiṁchugubodunnāvā
tĕppa tagalabĕṭṭestāvā eru dāḍa gāne
ruṇaṁ tīrsu taruṇaṁ vaste tappiṁchugubodunnāvā
tĕppa tagalabĕṭṭestāvā eru dāḍa gāne