చుట్టి చుట్టి యారజము చూపనేలంటాఁ గాక
(॥పల్లవి॥)
చుట్టి చుట్టి యారజము చూపనేలంటాఁ గాక
నెట్టుకొన్న సతులెల్లా నీ యంత నేరరా
(॥చుట్టి॥)
చిలికేవు కొంతగొంత చిరుసిగ్గు లూరకైనా
సలిపే వతనితోడ జాణతనాలు
కలపేవు వావులు కడనుండి యప్పటిని
యెలమి నీనేరుపులు యెంతచూపేవే
(॥చుట్టి॥)
నెరపేవు పలుమారు నీమురిపెము లెల్లాను
వొరసేవు చన్నులను వొద్దఁగూచుండి
గిరిపేవు కన్నులు జంకెనబొమ్మసన్నలతో
వరుసవెట్టుక యెంత వలపుచల్లేవే
(॥చుట్టి॥)
తనిపేవు నీకు నీకే తగిలి సరసమాడి
గునిసేవు ముద్దులు కొంగుట్టుక
యెనసె శ్రీవేంకటేశుఁ డీతఁ డింతలో నన్ను
పెనఁగి నీవింకా నెంత ప్రియము చెప్పేవే
(||pallavi||)
suṭṭi suṭṭi yārajamu sūbanelaṁṭām̐ gāga
nĕṭṭugŏnna sadulĕllā nī yaṁta nerarā
(||suṭṭi||)
siligevu kŏṁtagŏṁta sirusiggu lūragainā
salibe vadanidoḍa jāṇadanālu
kalabevu vāvulu kaḍanuṁḍi yappaḍini
yĕlami nīnerubulu yĕṁtasūbeve
(||suṭṭi||)
nĕrabevu palumāru nīmuribĕmu lĕllānu
vŏrasevu sannulanu vŏddam̐gūsuṁḍi
giribevu kannulu jaṁkĕnabŏmmasannalado
varusavĕṭṭuga yĕṁta valabusalleve
(||suṭṭi||)
tanibevu nīgu nīge tagili sarasamāḍi
gunisevu muddulu kŏṁguṭṭuga
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṁtalo nannu
pĕnam̐gi nīviṁkā nĕṁta priyamu sĕppeve