చుట్టపు వరుస వచ్చి సొలయుచు నున్నారము
(॥పల్లవి॥)
చుట్టపు వరుస వచ్చి సొలయుచు నున్నారము
తిట్టరుగదా తరితీపుల నున్నారము
(॥చుట్ట॥)
తగవులు చెప్పఁగాను తప్పులేమీ రావుగదా
మిగులార సరసమాడే మీలోనను
నగవులు నగఁగాను నన్నేమి ననరు గదా
తగని కోపము మీ కాఁతాళములు చూచి
(॥చుట్ట॥)
సాకిరై నిలువఁగాను సడి మాకు రాదు గదా
మేకుల పంతములాడే మీలోనను
రాకపోకలకు మమ్ము రవ్వలు సేయరు గదా
కాకరితనముల మీ కందువలు చూచి
(॥చుట్ట॥)
నిక్కి మిమ్ముఁ గూడించఁగా నింద మాకు రాదు గదా
మిక్కిలి జవ్వనముల మీలోనను
యెక్కువ శ్రీ వేంకటేశ యిద్దరు నెనసితిరి
చొక్కించరుగదా మీమా సుద్దులెల్లఁ జూచి
(||pallavi||)
suṭṭabu varusa vachchi sŏlayusu nunnāramu
tiṭṭarugadā taridībula nunnāramu
(||suṭṭa||)
tagavulu sĕppam̐gānu tappulemī rāvugadā
migulāra sarasamāḍe mīlonanu
nagavulu nagam̐gānu nannemi nanaru gadā
tagani kobamu mī kām̐tāḽamulu sūsi
(||suṭṭa||)
sāgirai niluvam̐gānu saḍi māgu rādu gadā
megula paṁtamulāḍe mīlonanu
rāgabogalagu mammu ravvalu seyaru gadā
kāgaridanamula mī kaṁduvalu sūsi
(||suṭṭa||)
nikki mimmum̐ gūḍiṁcham̐gā niṁda māgu rādu gadā
mikkili javvanamula mīlonanu
yĕkkuva śhrī veṁkaḍeśha yiddaru nĕnasidiri
sŏkkiṁcharugadā mīmā suddulĕllam̐ jūsi