(॥పల్లవి॥)
సుదతులు లేరే సోబనము సేయ
పొదలి మరుగురుఁడు పొడమెను వాఁడె
(॥ద॥)
శ్రావణబహుళాష్టమి యిదివో
ఆవలఁ జంద్రోదయం బదివో
యీవేళ నడురే యిప్పుడే రోహిణి
దేవకి కొడుకుఁ గనె దేవుఁడు వీఁడె
(॥ద॥)
సరి వసుదేవుని సంతోష మదివో
మరులుగొల్పేహరిమా యదివో
విరిసెరు కాంతులవెలుఁ గదివో
పురుషోత్తముఁడె పుట్టెను వీఁడె
(॥ద॥)
నాలుగుచేతులు నలి నివివో
మేలిమిసోమ్ములమెఱుఁగు లవె
యీలీల శ్రీవేంకటేశ్వరుఁడు మన-
పాల జనించెను బాలుఁడు వీఁడె
(||pallavi||)
sudadulu lere sobanamu seya
pŏdali marugurum̐ḍu pŏḍamĕnu vām̐ḍĕ
(||da||)
śhrāvaṇabahuḽāṣhṭami yidivo
āvalam̐ jaṁdrodayaṁ badivo
yīveḽa naḍure yippuḍe rohiṇi
devagi kŏḍugum̐ ganĕ devum̐ḍu vīm̐ḍĕ
(||da||)
sari vasudevuni saṁtoṣha madivo
marulugŏlbeharimā yadivo
virisĕru kāṁtulavĕlum̐ gadivo
puruṣhottamum̐ḍĕ puṭṭĕnu vīm̐ḍĕ
(||da||)
nālugusedulu nali nivivo
melimisommulamĕṟum̐gu lavĕ
yīlīla śhrīveṁkaḍeśhvarum̐ḍu mana-
pāla janiṁchĕnu bālum̐ḍu vīm̐ḍĕ