సుదతి చందము నీవే చూడవయ్యా
(॥పల్లవి॥)
సుదతి చందము నీవే చూడవయ్యా
అదివో యిద్దరూ మాఁటలాడుకోరయ్యా
(॥సుద॥)
తలపోయుఁ గొంతవడి తరుణి నీ గుణములు
చెలఁగి తమకమునఁ జెమరించును
పలుమారు నీమీఁది పదములు వాడుకొని
అలరి యాపె సుద్దు లెంతడిగేవయ్యా
(॥సుద॥)
పనివూని నీ సుద్దులు పడఁతులతోఁ జెప్పును
ననుపు నీ చేఁతలకు నవ్వు లోలోనె
వొనరఁ బానుపుమీఁద నుండి నీ కేదురుచూచు
యెనయఁగ నాపె కత లిటువంటియ్యా
(॥సుద॥)
నీ రతులు భావించి నెమ్మిఁ జిత్తము గరఁగు
కోరికలు నీపైఁ బెట్టి గుబ్బతిలును
చేరి యింతలో నీకెను శ్రీవేంకటేశ కూడితి -
వీ రీతిరి నీ దేవులు యెరుఁగుకోవయ్యా
(||pallavi||)
sudadi saṁdamu nīve sūḍavayyā
adivo yiddarū mām̐ṭalāḍugorayyā
(||suda||)
talaboyum̐ gŏṁtavaḍi taruṇi nī guṇamulu
sĕlam̐gi tamagamunam̐ jĕmariṁchunu
palumāru nīmīm̐di padamulu vāḍugŏni
alari yābĕ suddu lĕṁtaḍigevayyā
(||suda||)
panivūni nī suddulu paḍam̐tuladom̐ jĕppunu
nanubu nī sem̐talagu navvu lolonĕ
vŏnaram̐ bānubumīm̐da nuṁḍi nī kedurusūsu
yĕnayam̐ga nābĕ kada liḍuvaṁṭiyyā
(||suda||)
nī radulu bhāviṁchi nĕmmim̐ jittamu garam̐gu
korigalu nībaim̐ bĕṭṭi gubbadilunu
seri yiṁtalo nīgĕnu śhrīveṁkaḍeśha kūḍidi -
vī rīdiri nī devulu yĕrum̐gugovayyā