సుదతి నొకటొకటనే చూడరే దిష్టంబు
(॥పల్లవి॥)
సుదతి నొకటొకటనే చూడరే దిష్టంబు
పొదలు విరహంబు లోఁ బొదలఁగా నేఁడు
(॥సుద॥)
అంగన మీనాక్షియైనందు కిదె దిష్టంబు
కంగి పతిఁబాసి ఇటు గను ముయ్యదు
అంగవించి కమలముఖియగుట కిది దిష్టంబు
పొంగుఁ జెమటలనీటఁ బొదలీని నేఁడు
(॥సుద॥)
మగువ వుత్తడియనెడిమాట కిది దిష్టంబు
పొగరు వలపులకాఁకఁ బుటమెక్కెను
అగడుతో శైలకుచయగుట కిదె దిష్టంబు
చిగురుఁబులకలచేఁతఁ జెలఁగీని నేఁడు
(॥సుద॥)
అతివ బింబాధరై యలరుటకు దిష్టంబు
తతిని శ్రీవేంకటోత్తముఁడు దొడికె
మితిఁ గంబుకంఠియై మెఱయుటకు దిష్టంబు
రతిరాజతంత్రముల రవళిగొనె నేఁడు
(||pallavi||)
sudadi nŏgaḍŏgaḍane sūḍare diṣhṭaṁbu
pŏdalu virahaṁbu lom̐ bŏdalam̐gā nem̐ḍu
(||suda||)
aṁgana mīnākṣhiyainaṁdu kidĕ diṣhṭaṁbu
kaṁgi padim̐bāsi iḍu ganu muyyadu
aṁgaviṁchi kamalamukhiyaguḍa kidi diṣhṭaṁbu
pŏṁgum̐ jĕmaḍalanīḍam̐ bŏdalīni nem̐ḍu
(||suda||)
maguva vuttaḍiyanĕḍimāḍa kidi diṣhṭaṁbu
pŏgaru valabulagām̐kam̐ buḍamĕkkĕnu
agaḍudo śhailagusayaguḍa kidĕ diṣhṭaṁbu
sigurum̐bulagalasem̐tam̐ jĕlam̐gīni nem̐ḍu
(||suda||)
adiva biṁbādharai yalaruḍagu diṣhṭaṁbu
tadini śhrīveṁkaḍottamum̐ḍu dŏḍigĕ
midim̐ gaṁbugaṁṭhiyai mĕṟayuḍagu diṣhṭaṁbu
radirājadaṁtramula ravaḽigŏnĕ nem̐ḍu