చూచినవారు నవ్వరా చొప్పులెత్తి నన్నైనా
(॥పల్లవి॥)
చూచినవారు నవ్వరా చొప్పులెత్తి నన్నైనా
లాచి నాతోడుతను మేలములాడీ యిప్పుడే
(॥చూచి॥)
కొప్పు దువ్వి కొలువులో కొనగోరఁ జెనకీని
చెప్పరే పతికి బుద్ది చెలులాల
చప్పుడుసేయక యెంత సన్న సేసిన మానఁడు
ఇప్పుడు సిగ్గువడఁడు ఇందరిలోఁ దాను
(॥చూచి॥)
ముట్టీ నందరిముందు మొకము దప్పక చూచీ
రట్టుసేయుమనరే రామలాల
గట్టుతోఁ బరుసేసుకొనివాను యెఱుఁగఁడు
కట్టఁగడవా రిందుకు కాకుసేయరా
(॥చూచి॥)
సరిపాదము దొక్కీని సంగడివారుండఁగాను
తెరవేసుకొమ్మనరే తెరవలాల
ఇరవై శ్రీ వేంకటేశుఁడింకా రతిఁ దనియఁడు
సిరులఆసోదము చెప్పరా దితనికి
(||pallavi||)
sūsinavāru navvarā sŏppulĕtti nannainā
lāsi nādoḍudanu melamulāḍī yippuḍe
(||sūsi||)
kŏppu duvvi kŏluvulo kŏnagoram̐ jĕnagīni
sĕppare padigi buddi sĕlulāla
sappuḍuseyaga yĕṁta sanna sesina mānam̐ḍu
ippuḍu sigguvaḍam̐ḍu iṁdarilom̐ dānu
(||sūsi||)
muṭṭī naṁdarimuṁdu mŏgamu dappaga sūsī
raṭṭuseyumanare rāmalāla
gaṭṭudom̐ barusesugŏnivānu yĕṟum̐gam̐ḍu
kaṭṭam̐gaḍavā riṁdugu kāguseyarā
(||sūsi||)
saribādamu dŏkkīni saṁgaḍivāruṁḍam̐gānu
tĕravesugŏmmanare tĕravalāla
iravai śhrī veṁkaḍeśhum̐ḍiṁkā radim̐ daniyam̐ḍu
sirulaāsodamu sĕpparā didanigi