చూచితి నే నప్పుడు మీ సొంపులు కిమ్ములనుండి
(॥పల్లవి॥)
చూచితి నే నప్పుడు మీ సొంపులు కిమ్ములనుండి
ఆచోటిదాని చేఁత లివౌనా వోయీ
(॥చూచి॥)
పిలిచెఁగా అదినిన్ను పెద్ద పెద్ద యెలుఁగున
సొలసెఁగా మాటలను చొక్కులఁ బెట్టి
వెలయఁ బానుపుమీఁద విడెము చేతికిచ్చెఁగా
తలఁచుకో అలనాటిదానిసుద్దులోయీ
(॥చూచి॥)
నొక్కెఁగా చెక్కులు నిన్ను నోరఁ దమ్మవెట్టుమని
మొక్కెఁగా చేయెత్తి ముసిముసినవ్వుతో
వెక్కసపుఁజన్నులను వేడుకతో నొత్తెఁగా
చొక్కుచు నెంచుకో దానిచుట్టరికాలోయీ
(॥చూచి॥)
పెనఁగెఁగా కాఁగిటను ప్రియములు రెట్చించ
తనిసెఁగా రతులను తారుకాణలై
యెనసితివి శ్రీవేంకటేశ యిప డిటు నన్ను
మనసునఁ బెట్టుకో మర్మములు దానివోయీ
(||pallavi||)
sūsidi ne nappuḍu mī sŏṁpulu kimmulanuṁḍi
āsoḍidāni sem̐ta livaunā voyī
(||sūsi||)
pilisĕm̐gā adininnu pĕdda pĕdda yĕlum̐guna
sŏlasĕm̐gā māḍalanu sŏkkulam̐ bĕṭṭi
vĕlayam̐ bānubumīm̐da viḍĕmu sedigichchĕm̐gā
talam̐sugo alanāḍidānisudduloyī
(||sūsi||)
nŏkkĕm̐gā sĕkkulu ninnu noram̐ dammavĕṭṭumani
mŏkkĕm̐gā seyĕtti musimusinavvudo
vĕkkasabum̐jannulanu veḍugado nŏttĕm̐gā
sŏkkusu nĕṁchugo dānisuṭṭarigāloyī
(||sūsi||)
pĕnam̐gĕm̐gā kām̐giḍanu priyamulu rĕṭchiṁcha
tanisĕm̐gā radulanu tārugāṇalai
yĕnasidivi śhrīveṁkaḍeśha yiba ḍiḍu nannu
manasunam̐ bĕṭṭugo marmamulu dānivoyī