Sooside mamchivaamdavu suttamavai vunnaamdavu

చూచితే మంచివాఁడవు చుట్టమవై వున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
చూచితే మంచివాఁడవు చుట్టమవై వున్నాఁడవు
యేచి యెట్టు సోదించి యెఱిఁగేమో నిన్నును

(॥చూచి॥)
తగిలి సరసములే తఱచుగా నాడేవు
నగవులే నవ్వేవు నన్నుఁజూచి
యెగసక్కెమో నిజమో యేదౌతా నెఱఁగము
నిగిడి రతికి నెట్టు నిన్నుఁ బిలిచేను

(॥చూచి॥)
మీతిమీరి వూరకైనా మెచ్చులే మెచ్చేవు
అతిమోహములే చల్లే వప్పటి నాపై
మతకమో నాపైబత్తో మరి యేర్పరచరాదు
సతమై నీమీఁదఁ జేయిచాఁచ నెట్టు వచ్చును

(॥చూచి॥)
అడియాలాలే చెప్పి ఆసలెల్లాఁజూపేవు
కడఁగి నిలుచుండఁగాఁ గాఁగిలించేవు
యెడయక శ్రీవేంకటేశ నీ కిది ప్రియమో
కడుజాణ వౌదువు కాదనఁగఁ గలనా

(||pallavi||)
sūside maṁchivām̐ḍavu suṭṭamavai vunnām̐ḍavu
yesi yĕṭṭu sodiṁchi yĕṟim̐gemo ninnunu

(||sūsi||)
tagili sarasamule taṟasugā nāḍevu
nagavule navvevu nannum̐jūsi
yĕgasakkĕmo nijamo yedaudā nĕṟam̐gamu
nigiḍi radigi nĕṭṭu ninnum̐ bilisenu

(||sūsi||)
mīdimīri vūragainā mĕchchule mĕchchevu
adimohamule salle vappaḍi nābai
madagamo nābaibatto mari yerbarasarādu
sadamai nīmīm̐dam̐ jeyisām̐sa nĕṭṭu vachchunu

(||sūsi||)
aḍiyālāle sĕppi āsalĕllām̐jūbevu
kaḍam̐gi nilusuṁḍam̐gām̐ gām̐giliṁchevu
yĕḍayaga śhrīveṁkaḍeśha nī kidi priyamo
kaḍujāṇa vauduvu kādanam̐gam̐ galanā