చూచితే గోలగాని జూటుదనా లిన్నియును
(॥పల్లవి॥)
చూచితే గోలగాని జూటుదనా లిన్నియును
చేచేత నీపె చేఁతలు చెప్పఁ గొత్తలయ్యా
(॥చూచి॥)
మాటలఁ దేనెలు గారీ మలసితే సిగ్గుదేరీ
తేటలై కనుచూపులఁ దెల్లవారీని
కోటిసేయ నిన్ను నీపె కూరిములు గొసరీని
నీటున నెన్నఁడింతేసి నేరిచెనో కాని
(॥చూచి॥)
నడక నందెలు వాఁగీ నవ్వితే వెన్నెల రేఁగీ
తడవితేఁ గొప్పు తుమ్మిదలు మూఁగీని
వడిగాఁ జెనకుతాను వలపులు నిన్ను నాఁగీ
కడు నెటులాఁ గతలఁ గఱచెనోకాని
(॥చూచి॥)
కొనగోరు నీపైఁ జిమ్మీ గుబ్బచన్నులనుఁ గుమ్మీ
కినియక నిన్నునే కాఁగిటఁ గమ్మీని
పనితో నలమేల్మంగపతిశ్రీవేంకటేశుఁడ
యెనసితివి నన్ను తా నెట్టెఱిఁగెనోకాని
(||pallavi||)
sūside golagāni jūḍudanā linniyunu
seseda nībĕ sem̐talu sĕppam̐ gŏttalayyā
(||sūsi||)
māḍalam̐ denĕlu gārī malaside sigguderī
teḍalai kanusūbulam̐ dĕllavārīni
koḍiseya ninnu nībĕ kūrimulu gŏsarīni
nīḍuna nĕnnam̐ḍiṁtesi nerisĕno kāni
(||sūsi||)
naḍaga naṁdĕlu vām̐gī navvide vĕnnĕla rem̐gī
taḍavidem̐ gŏppu tummidalu mūm̐gīni
vaḍigām̐ jĕnagudānu valabulu ninnu nām̐gī
kaḍu nĕḍulām̐ gadalam̐ gaṟasĕnogāni
(||sūsi||)
kŏnagoru nībaim̐ jimmī gubbasannulanum̐ gummī
kiniyaga ninnune kām̐giḍam̐ gammīni
panido nalamelmaṁgabadiśhrīveṁkaḍeśhum̐ḍa
yĕnasidivi nannu tā nĕṭṭĕṟim̐gĕnogāni