Soosi soosi naagu nitte sodyamayyeeni

చూచి చూచి నాకు నిట్టె సోద్యమయ్యీని
Language

(॥పల్లవి॥)
చూచి చూచి నాకు నిట్టె సోద్యమయ్యీని
కాచుక తా నెందుండి కలిగెనోకాని

(॥చూచి॥)
చెలరేఁగి చెలరేఁగి సేవలెల్లాఁ జేసీని
కలికి నీ చిత్త మెట్టు గనెనోకాని
మలసి మలసి నీతో మారుకొని మాఁటలాడీ
యెలమి నీ వెంత చన విచ్చితివోకాని

(॥చూచి॥)
నానఁబెట్టి నానఁబెట్టి నవ్వు లెల్లా నవ్వీని
ఆనుక నీ కెంత చుట్టమాయెనోకాని
కానుకిచ్చి కానుకిచ్చి కతలెల్లాఁ జెప్పీని
సేవలుగానే సన్నలు సేసితివోకాని

(॥చూచి॥)
చేయి ముట్టి చేయి ముట్టి చెనకఁగ వచ్చీని
నీ యితవెరఁగ వెంత నేర్చునోకాని
యీయెడ శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
చాయల నాపెకూ నెంత సతమయితివోకాని

(||pallavi||)
sūsi sūsi nāgu niṭṭĕ sodyamayyīni
kāsuga tā nĕṁduṁḍi kaligĕnogāni

(||sūsi||)
sĕlarem̐gi sĕlarem̐gi sevalĕllām̐ jesīni
kaligi nī sitta mĕṭṭu ganĕnogāni
malasi malasi nīdo mārugŏni mām̐ṭalāḍī
yĕlami nī vĕṁta sana vichchidivogāni

(||sūsi||)
nānam̐bĕṭṭi nānam̐bĕṭṭi navvu lĕllā navvīni
ānuga nī kĕṁta suṭṭamāyĕnogāni
kānugichchi kānugichchi kadalĕllām̐ jĕppīni
sevalugāne sannalu sesidivogāni

(||sūsi||)
seyi muṭṭi seyi muṭṭi sĕnagam̐ga vachchīni
nī yidavĕram̐ga vĕṁta nersunogāni
yīyĕḍa śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
sāyala nābĕgū nĕṁta sadamayidivogāni