Soosevaarigim jooda suttamuvale nunnaamdu

చూచేవారికిఁ జూడ చుట్టమువలె నున్నాఁడు
Language

(॥పల్లవి॥)
చూచేవారికిఁ జూడ చుట్టమువలె నున్నాఁడు
యేఁచి యీతని కతలు యెన్నియైనాఁ గలవు

(॥చూచే॥)
ఆసలనే పెట్టిపెట్టి ఆయములంటి నన్ను
పోసరించి కడువలపులు రేఁచెనే
వోసరించి జూజాలాడి వూరకే సుద్దులు చెప్పి
వేసాలు చేసినాఁడే వేగినంతా నితఁడు

(॥చూచే॥)
సరసములాడియాడి సన్నలనే మోవిచూపి
మరిగించి ప్రియముల మచ్చికలు చూపెనే
సొరిది వీడెములిచ్చి సొమ్ములెల్లా మెడఁబెట్టి
తెరమఱఁగున దప్పి దేర్చె నితఁడు

(॥చూచే॥)
మచ్చికలు రేఁచిరేఁచి మన్ననలు నాకొసగి
హెచ్చి ఇంతసేసి నేఁ డిటు గూడెనే
అచ్చపు శ్రీవేంకటేశుఁ డట్టె పువ్వులను వేసి
రచ్చఁబెట్టి ఇందాఁకా రాఁపుసేసె నితఁడు

(||pallavi||)
sūsevārigim̐ jūḍa suṭṭamuvalĕ nunnām̐ḍu
yem̐si yīdani kadalu yĕnniyainām̐ galavu

(||sūse||)
āsalane pĕṭṭibĕṭṭi āyamulaṁṭi nannu
posariṁchi kaḍuvalabulu rem̐sĕne
vosariṁchi jūjālāḍi vūrage suddulu sĕppi
vesālu sesinām̐ḍe veginaṁtā nidam̐ḍu

(||sūse||)
sarasamulāḍiyāḍi sannalane movisūbi
marigiṁchi priyamula machchigalu sūbĕne
sŏridi vīḍĕmulichchi sŏmmulĕllā mĕḍam̐bĕṭṭi
tĕramaṟam̐guna dappi dersĕ nidam̐ḍu

(||sūse||)
machchigalu rem̐sirem̐si mannanalu nāgŏsagi
hĕchchi iṁtasesi nem̐ ḍiḍu gūḍĕne
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ puvvulanu vesi
rachcham̐bĕṭṭi iṁdām̐kā rām̐pusesĕ nidam̐ḍu