Soosemu mee vedulu sobaanam baademu nemu

చూచేము మీ వేడులు సోబానఁ బాడేము నేము
Language

(॥పల్లవి॥)
చూచేము మీ వేడులు సోబానఁ బాడేము నేము
యేచిన మీ కోరికలు యీడేర్చుకోరయ్యా

(॥చూచే॥)
మంతనమాడేటివేళ మరఁగులు వెట్టుదురా
చెంత నొనగూడె నిఁ సిగ్గులేడవి
పంతాలు ము నీడెరె పాడివెట్ట నిఁకనేల
బంతినే మీ వలపులు పచారించుకోరయ్య

(॥చూచే॥)
సరసమాడే యప్పుడు జంపులుఁ బనిలేదు
తెరవేసుకొంటిరి సాదించేదేమి
వెరపులెల్లా గంటిమి వేరే యిఁకఁ బొంకనేల
తరితీపుమీరతులు దక్కించుకోరయ్యా

(॥చూచే॥)
వీడెము లందుకొనియు విచారాలు సేతురా
జోడై వున్నారు ఇఁక సోదించనేల
యీడన శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తోడఁదోడ మీ యెమ్మెలు తొరలించుకోరయ్యా

(||pallavi||)
sūsemu mī veḍulu sobānam̐ bāḍemu nemu
yesina mī korigalu yīḍersugorayyā

(||sūse||)
maṁtanamāḍeḍiveḽa maram̐gulu vĕṭṭudurā
sĕṁta nŏnagūḍĕ nim̐ sigguleḍavi
paṁtālu mu nīḍĕrĕ pāḍivĕṭṭa nim̐kanela
baṁtine mī valabulu pasāriṁchugorayya

(||sūse||)
sarasamāḍe yappuḍu jaṁpulum̐ baniledu
tĕravesugŏṁṭiri sādiṁchedemi
vĕrabulĕllā gaṁṭimi vere yim̐kam̐ bŏṁkanela
taridībumīradulu dakkiṁchugorayyā

(||sūse||)
vīḍĕmu laṁdugŏniyu visārālu sedurā
joḍai vunnāru im̐ka sodiṁchanela
yīḍana śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
toḍam̐doḍa mī yĕmmĕlu tŏraliṁchugorayyā