Sooduvu raavayyaa nee sudadi vunnalaagulu

చూతువు రావయ్యా నీ సుదతి వున్నలాగులు
Language

(॥పల్లవి॥)
చూతువు రావయ్యా నీ సుదతి వున్నలాగులు
యీతల విన్నవించఁగ నెవ్వరు నేరుతురు

(॥చూతు॥)
చిత్తమెల్లా నీమీఁద చేతులు చెక్కులమీఁద
కొత్తకొత్తచెమటలు గుబ్బమీఁద
తత్తరముమదిలోన తా నున్నది తెరలోన
హతై నీపై వలపులు అంగన కీరీతిని

(॥చూతు॥)
చెప్పేమాట చెలితోడ చిరునవ్వు సిగ్గుతోడ
దప్పి కప్పురపుమోవి లప్పతోడను
కొప్పుజారెఁ జెంపసంది కోరికె నీతని(ను) సంది
వుప్పతిల్లీఁ దలపోఁత లువిద కీరీతిని

(॥చూతు॥)
పులకలు నిలువెల్లా పొందికలే కాఁగిలెల్లా
పిలుపుఁబ్రియములే పెదవులెల్లా
కలసితి వింతలోనె కాంతను శ్రీవేంకటేశ
కలిగె వేడుకలెల్లా కలికి కీరీతిని

(||pallavi||)
sūduvu rāvayyā nī sudadi vunnalāgulu
yīdala vinnaviṁcham̐ga nĕvvaru neruduru

(||sūdu||)
sittamĕllā nīmīm̐da sedulu sĕkkulamīm̐da
kŏttagŏttasĕmaḍalu gubbamīm̐da
tattaramumadilona tā nunnadi tĕralona
hadai nībai valabulu aṁgana kīrīdini

(||sūdu||)
sĕppemāḍa sĕlidoḍa sirunavvu siggudoḍa
dappi kappurabumovi lappadoḍanu
kŏppujārĕm̐ jĕṁpasaṁdi korigĕ nīdani(nu) saṁdi
vuppadillīm̐ dalabom̐ta luvida kīrīdini

(||sūdu||)
pulagalu niluvĕllā pŏṁdigale kām̐gilĕllā
pilubum̐briyamule pĕdavulĕllā
kalasidi viṁtalonĕ kāṁtanu śhrīveṁkaḍeśha
kaligĕ veḍugalĕllā kaligi kīrīdini