చూడవే చెలియా తనసుద్దు లిటువంటివే
(॥పల్లవి॥)
చూడవే చెలియా తనసుద్దు లిటువంటివే
వోడక విభుఁడు తాను వుల్లసాలాడేనా
(॥చూడ॥)
కంగులేక వింటేను కత చెప్పవచ్చుఁగాక
వెంగేలుగా భావించితే వింతగాదటే
ముంగిటికి వచ్చితేను మొక్కు మొక్కవచ్చుఁగాక
చెంగిచెంగి పొలసితే చేసేదేమే
(॥చూడ॥)
ననిచి మోముచూపితే నవ్వు నవ్వచ్చుఁగాక
తనలో సిగ్గువడితేఁ దడవేదెట్టే
చనవిచ్చితే మోవి చవిగొనవచ్చుఁగాక
పనివడి వేఁడుకోఁగా బచ్చిసేయనేఁటికే
(॥చూడ॥)
కలసి వూరకుండితేఁ గాఁగిలించవచ్చుఁగాక
గిలిగింతలైతే గోర గీరవచ్చునా
బలువుఁ డలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు
యిల నీతఁడే నన్నేలె నిఁక నేమనేవే
(||pallavi||)
sūḍave sĕliyā tanasuddu liḍuvaṁṭive
voḍaga vibhum̐ḍu tānu vullasālāḍenā
(||sūḍa||)
kaṁgulega viṁṭenu kada sĕppavachchum̐gāga
vĕṁgelugā bhāviṁchide viṁtagādaḍe
muṁgiḍigi vachchidenu mŏkku mŏkkavachchum̐gāga
sĕṁgisĕṁgi pŏlaside sesedeme
(||sūḍa||)
nanisi momusūbide navvu navvachchum̐gāga
tanalo sigguvaḍidem̐ daḍavedĕṭṭe
sanavichchide movi savigŏnavachchum̐gāga
panivaḍi vem̐ḍugom̐gā bachchiseyanem̐ṭige
(||sūḍa||)
kalasi vūraguṁḍidem̐ gām̐giliṁchavachchum̐gāga
giligiṁtalaide gora gīravachchunā
baluvum̐ ḍalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
yila nīdam̐ḍe nannelĕ nim̐ka nemaneve