చూడవే నాదిక్కు సుదతి నీవు ఇఁకఁ
(॥పల్లవి॥)
చూడవే నాదిక్కు సుదతి నీవు ఇఁకఁ
జూడఁబోతే నన్నియును సోద్యాలే పో
(॥చూడ॥)
పలుకవే నాతోడఁ బడఁతి నేఁడు
పలికితే నిందరిలోఁ బసలేదువొ
తలఁచవే తొంట్టిపొద్దుతగు లింతై నా నేఁ
దలఁచితే బనులెల్లాఁ దారుకాణెపొ
(॥చూడ॥)
అందుకొనే విడెమైనా నతివా యిట్టె
అందుకోంటెఁ దాఁకుంబో నీ యాయములెల్ల
ముందు నవ్వవే యిఁక ముచ్చటదీర
ముందు నే నవ్వితేఁగన మోవి గంటివడుఁ బో
(॥చూడ॥)
మఱవవే కాఁగిటిలో మాటలు చెలి అంత
మఱచితే కాఁకలెల్ల మక్కళించుఁబో
యెఱఁగవే శ్రీవేంకటేశుఁడ నేను నాలో
నెఱిఁగికాదా నిన్ను నేకమై కూడితిని
(||pallavi||)
sūḍave nādikku sudadi nīvu im̐kam̐
jūḍam̐bode nanniyunu sodyāle po
(||sūḍa||)
palugave nādoḍam̐ baḍam̐ti nem̐ḍu
paligide niṁdarilom̐ basaleduvŏ
talam̐save tŏṁṭṭibŏddudagu liṁtai nā nem̐
dalam̐side banulĕllām̐ dārugāṇĕbŏ
(||sūḍa||)
aṁdugŏne viḍĕmainā nadivā yiṭṭĕ
aṁdugoṁṭĕm̐ dām̐kuṁbo nī yāyamulĕlla
muṁdu navvave yim̐ka muchchaḍadīra
muṁdu ne navvidem̐gana movi gaṁṭivaḍum̐ bo
(||sūḍa||)
maṟavave kām̐giḍilo māḍalu sĕli aṁta
maṟaside kām̐kalĕlla makkaḽiṁchum̐bo
yĕṟam̐gave śhrīveṁkaḍeśhum̐ḍa nenu nālo
nĕṟim̐gigādā ninnu negamai kūḍidini