Soodavayyaa imkaa naabe sokkabum jakkamdanaalu

చూడవయ్యా ఇంకా నాపె చొక్కపుఁ జక్కఁదనాలు
Language

(॥పల్లవి॥)
చూడవయ్యా ఇంకా నాపె చొక్కపుఁ జక్కఁదనాలు
వేడుకకాఁడవు తొల్లె వెలయకుండుదువా

(॥చూడ॥)
మాటలఁ దేనెలు గారీ మక్కవల నోరూరీ
తేటలువారీ నాపెతెలిగఁన్నుల
ఆఁటదానిఁ గంటే నీవు ఆసోదకాడఁవు
పాటించి నీ విది గంటే భ్రమయకుండుదువా

(॥చూడ॥)
నవ్వుల వెన్నెల గాసీ నంటున వింతలు చూపీ
రవ్వలు సేసీని సింగారపుఁ జేఁతల
జవ్వనమదము సంతసమునకుఁ బుట్టినిల్లు
వువ్విళ్లూర నింత గలితే వోర్వఁగఁగలవా

(॥చూడ॥)
చెనకులు దుదిముట్టీ సిగ్గులనుఁ బాలకట్టీ
వినయములే తొట్టీ వెస రతుల
యెనసితివి శ్రీవేంకటేశ యీకెను నన్నూ
పెనఁగితి విందువంకఁ బ్రియ మందకుందువా

(||pallavi||)
sūḍavayyā iṁkā nābĕ sŏkkabum̐ jakkam̐danālu
veḍugagām̐ḍavu tŏllĕ vĕlayaguṁḍuduvā

(||sūḍa||)
māḍalam̐ denĕlu gārī makkavala norūrī
teḍaluvārī nābĕdĕligam̐nnula
ām̐ṭadānim̐ gaṁṭe nīvu āsodagāḍam̐vu
pāḍiṁchi nī vidi gaṁṭe bhramayaguṁḍuduvā

(||sūḍa||)
navvula vĕnnĕla gāsī naṁṭuna viṁtalu sūbī
ravvalu sesīni siṁgārabum̐ jem̐tala
javvanamadamu saṁtasamunagum̐ buṭṭinillu
vuvviḽlūra niṁta galide vorvam̐gam̐galavā

(||sūḍa||)
sĕnagulu dudimuṭṭī siggulanum̐ bālagaṭṭī
vinayamule tŏṭṭī vĕsa radula
yĕnasidivi śhrīveṁkaḍeśha yīgĕnu nannū
pĕnam̐gidi viṁduvaṁkam̐ briya maṁdaguṁduvā