చూడవమ్మ చెలియ యీ చుట్టుపట్టు నతని
(॥పల్లవి॥)
చూడవమ్మ చెలియ యీ చుట్టుపట్టు నతని
వోడక యెప్పుడు నావొద్దఁ బాయఁడితడు
(॥చూడ॥)
కలికి నావిభుఁడు రాఁ గలగంటి నంతలో నే -
నలరి ముచ్చటమాటలాడితి నేను
చలివాయఁ దములము చవిగొంటి మేలుకొంటి
తలఁగి యాతఁ డింకెందు దాఁగి రాఁడోకాని
(॥చూడ॥)
కిమ్మరను నేనొకకల గంటి నాతని -
నుమ్మగిలి కాఁగిట నే నొద్దికైతిని
చెమ్మఁజెమటలు మేనఁ జిమ్మిరేంగి వున్నవివె
అమ్మరో యతనిఁ గాన నండనుండె నిపుడు
(॥చూడ॥)
నెయ్యమున నెదుటనే నిక్కలగాఁ గంటి నిదె
యియ్యెడ శ్రీవేంకటేశుఁ డెనని కూడె
ముయ్యక మలసె నాలో ముదములు సమకూరె
పయ్యగమఱగుఁలోనె పచ్చి సేసె నితఁడు
(||pallavi||)
sūḍavamma sĕliya yī suṭṭubaṭṭu nadani
voḍaga yĕppuḍu nāvŏddam̐ bāyam̐ḍidaḍu
(||sūḍa||)
kaligi nāvibhum̐ḍu rām̐ galagaṁṭi naṁtalo ne -
nalari muchchaḍamāḍalāḍidi nenu
salivāyam̐ damulamu savigŏṁṭi melugŏṁṭi
talam̐gi yādam̐ ḍiṁkĕṁdu dām̐gi rām̐ḍogāni
(||sūḍa||)
kimmaranu nenŏgagala gaṁṭi nādani -
nummagili kām̐giḍa ne nŏddigaidini
sĕmmam̐jĕmaḍalu menam̐ jimmireṁgi vunnavivĕ
ammaro yadanim̐ gāna naṁḍanuṁḍĕ nibuḍu
(||sūḍa||)
nĕyyamuna nĕduḍane nikkalagām̐ gaṁṭi nidĕ
yiyyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnani kūḍĕ
muyyaga malasĕ nālo mudamulu samagūrĕ
payyagamaṟagum̐lonĕ pachchi sesĕ nidam̐ḍu