చూడరె చూడరె సుదతులాల యివి
(॥పల్లవి॥)
చూడరె చూడరె సుదతులాల యివి
వేడుక లీకెకు వేవేలాయా
(॥చూడ॥)
చెలియకుఁ జెమటలు చెక్కులఁ గారీ
మలయుచు జవ్వనమదము వలె
కళలు మోమునకు కడుఁగడుఁ దొలఁకీ
తళుకుల మెఱుఁగుల తరచువలె
(॥చూడ॥)
సవరని పులకలు సకియకుఁ బొడమీ
నవకపు జాజుల ననలవలె
తివురచుఁ గెంపులు దేరీ కన్నుల
కవ గూడిన చెంగలువలవలెను
(॥చూడ॥)
ముక్కున నతివకు ముంచీ నూర్పులు
మిక్కుటమగు తెమ్మెరలవలె
చొక్కి శ్రీవేంకటేశుని యలమేల్మంగ
పక్కనఁ గూడెను భాగ్యము వలెను
(||pallavi||)
sūḍarĕ sūḍarĕ sudadulāla yivi
veḍuga līgĕgu vevelāyā
(||sūḍa||)
sĕliyagum̐ jĕmaḍalu sĕkkulam̐ gārī
malayusu javvanamadamu valĕ
kaḽalu momunagu kaḍum̐gaḍum̐ dŏlam̐kī
taḽugula mĕṟum̐gula tarasuvalĕ
(||sūḍa||)
savarani pulagalu sagiyagum̐ bŏḍamī
navagabu jājula nanalavalĕ
tivurasum̐ gĕṁpulu derī kannula
kava gūḍina sĕṁgaluvalavalĕnu
(||sūḍa||)
mukkuna nadivagu muṁchī nūrbulu
mikkuḍamagu tĕmmĕralavalĕ
sŏkki śhrīveṁkaḍeśhuni yalamelmaṁga
pakkanam̐ gūḍĕnu bhāgyamu valĕnu