చూడరమ్మ చెలులాల సుదతి చెలువములు
(॥పల్లవి॥)
చూడరమ్మ చెలులాల సుదతి చెలువములు
వోడక వొండొంటితోడ నొనగూడి యున్నవి
(॥చూడ॥)
పొలుపైన మోము శశిఁ బోలించిన యందుకు
వెలఁది సెలవులను వెన్నెలగాసె
మెలుపునఁ బెనుఁ గొప్పు మేఘముఁ బోలినందుకు
చెలఁగి చెమటవాన చెక్కులఁ గురిసెను
(॥చూడ॥)
పడఁతి కెమ్మోని దొండపండుఁ బోలించినందుకు
కడఁగి పలుకుఁ జిలుకలు మూఁగెను
జడిగొని యీపెనాభి సరసిఁ బోలినందుకు
అడరి చనుజక్కవ లండనె కలిగెను
(॥చూడ॥)
తరుణి పసిఁడిబొమ్మఁ దగఁ బోలించినందుకు
నిరతిఁ బదారువన్నియల మించె
సిరుల శ్రీవేంకటేశుఁ జెందఁ బోలించినందుకు
మరుని కొమారికపు మన్ననలు మించెను
(||pallavi||)
sūḍaramma sĕlulāla sudadi sĕluvamulu
voḍaga vŏṁḍŏṁṭidoḍa nŏnagūḍi yunnavi
(||sūḍa||)
pŏlubaina momu śhaśhim̐ boliṁchina yaṁdugu
vĕlam̐di sĕlavulanu vĕnnĕlagāsĕ
mĕlubunam̐ bĕnum̐ gŏppu meghamum̐ bolinaṁdugu
sĕlam̐gi sĕmaḍavāna sĕkkulam̐ gurisĕnu
(||sūḍa||)
paḍam̐ti kĕmmoni dŏṁḍabaṁḍum̐ boliṁchinaṁdugu
kaḍam̐gi palugum̐ jilugalu mūm̐gĕnu
jaḍigŏni yībĕnābhi sarasim̐ bolinaṁdugu
aḍari sanujakkava laṁḍanĕ kaligĕnu
(||sūḍa||)
taruṇi pasim̐ḍibŏmmam̐ dagam̐ boliṁchinaṁdugu
niradim̐ badāruvanniyala miṁchĕ
sirula śhrīveṁkaḍeśhum̐ jĕṁdam̐ boliṁchinaṁdugu
maruni kŏmārigabu mannanalu miṁchĕnu