Soodaramma selulaala sudadi sakkamdanaalu

చూడరమ్మ చెలులాల సుదతి చక్కఁదనాలు
Language

(॥పల్లవి॥)
చూడరమ్మ చెలులాల సుదతి చక్కఁదనాలు
కూడుకొన్న పతి కాంతిఁ గురులే పోలెను

(॥చూడ॥)
మొగము చందురుఁ బోలె ముంచిన యీ యిందిరకు
తగినతోడఁబుట్టు గాఁతఁడే కనక
నగ వమృతముఁ బోలె నలినాక్షి కదియను
తగినపుట్టిన యింటిధనమే కనక

(॥చూడ॥)
సతిగుణమింతాను సముద్రమునే పోలె
తతి నాతఁ డీకెకు తండ్రిగనక
మితిగాఁ గన్నులు గండుమీనములఁ బోలె నవి
గతి గూడి తమ వారి కడవే కనక

(॥చూడ॥)
తరుణి పాదాలు కల్పతరువుచిగురుఁ బోలె
పరగఁగఁ దనవెనుబలమంటాను
గరిమ శ్రీవేంకటేశుఁ గైకొని పెండ్లాడి యీపె
సరవు లాతనిఁ బోలె సరసుఁ డంటాను

(||pallavi||)
sūḍaramma sĕlulāla sudadi sakkam̐danālu
kūḍugŏnna padi kāṁtim̐ gurule polĕnu

(||sūḍa||)
mŏgamu saṁdurum̐ bolĕ muṁchina yī yiṁdiragu
taginadoḍam̐buṭṭu gām̐tam̐ḍe kanaga
naga vamṛtamum̐ bolĕ nalinākṣhi kadiyanu
taginabuṭṭina yiṁṭidhaname kanaga

(||sūḍa||)
sadiguṇamiṁtānu samudramune polĕ
tadi nādam̐ ḍīgĕgu taṁḍriganaga
midigām̐ gannulu gaṁḍumīnamulam̐ bolĕ navi
gadi gūḍi tama vāri kaḍave kanaga

(||sūḍa||)
taruṇi pādālu kalbadaruvusigurum̐ bolĕ
paragam̐gam̐ danavĕnubalamaṁṭānu
garima śhrīveṁkaḍeśhum̐ gaigŏni pĕṁḍlāḍi yībĕ
saravu lādanim̐ bolĕ sarasum̐ ḍaṁṭānu