చూడరమ్మ సతులాల సుదతి లాగులు నేఁడు
(॥పల్లవి॥)
చూడరమ్మ సతులాల సుదతి లాగులు నేఁడు
యేడలేని తమకాల ఇంపు లెట్టివొ
(॥చూడ॥)
కన్నులఁ దప్పకచూచు గక్కననుఁ దలవంచు
అన్నిటా విభునిఁ జెలి యంపలేక వేగిలేచి
తన్నుఁదా నాతనిరూపు తలపోసుఁ గన్నుమూసు
యెన్నరానిసతిమో మేమిచెప్పదే
(॥చూడ॥)
మగిడిమగిడి వచ్చు మంతనాన మాటలాడు
పగటున రమణునిఁ బాయలేక జలజాక్షి
నగుతానే విడెమిచ్చు నాలి నాకుమడిచిచ్చు
సోగిసి యీవలపులాసోద మెట్టివో
(॥చూడ॥)
కమ్మరానుఁ గాగిలించు కందువగా మోవి ఇచ్చు
తెమ్మగా శ్రీవేంకటేశుతీపురతులు మరిగి
దొమ్మినేసి కూటమికి దొమతెరలోని కేఁగు
అమ్మలాల జవ్వునపాయపువేడు కెట్టిదో
(||pallavi||)
sūḍaramma sadulāla sudadi lāgulu nem̐ḍu
yeḍaleni tamagāla iṁpu lĕṭṭivŏ
(||sūḍa||)
kannulam̐ dappagasūsu gakkananum̐ dalavaṁchu
anniḍā vibhunim̐ jĕli yaṁpalega vegilesi
tannum̐dā nādanirūbu talabosum̐ gannumūsu
yĕnnarānisadimo memisĕppade
(||sūḍa||)
magiḍimagiḍi vachchu maṁtanāna māḍalāḍu
pagaḍuna ramaṇunim̐ bāyalega jalajākṣhi
nagudāne viḍĕmichchu nāli nāgumaḍisichchu
sogisi yīvalabulāsoda mĕṭṭivo
(||sūḍa||)
kammarānum̐ gāgiliṁchu kaṁduvagā movi ichchu
tĕmmagā śhrīveṁkaḍeśhudīburadulu marigi
dŏmminesi kūḍamigi dŏmadĕraloni kem̐gu
ammalāla javvunabāyabuveḍu kĕṭṭido