చూడరమ్మ నిచ్చకొత్తసొద్యమ(ము?)లాయ
(॥పల్లవి॥)
చూడరమ్మ నిచ్చకొత్తసొద్యమ(ము?)లాయ
వేడుక విభునిచేత వెల్లవిరులాయ
(॥చూడ॥)
అతను విరహవేళ అందపుఁగురులు జారి
అతివనొసలిపైఁ దూలాడఁగాను
సతినాసికమనేటి సంపెంగపూదావి సోఁకి
అతిఘోరపలులు తూలాడినయట్లాయ
(॥చూడ॥)
ఆఁపలేక పతికడ కంగన యలపుతోడ
యేపున మెల్లమెల్లనె యేఁగఁగాను
చేపట్టి నెన్నడిమిసింహపుగాలికిఁ గరి
కేపున నేఁగుచు నలికేటివిధమాయ
(॥చూడ॥)
యింతలోనె శ్రీవేంకటేశుఁ డెదురుగ వచ్చి
కాంతఁ గూడఁగ రతిఁ గరఁగఁగాను
పొంతఁ జంద్రోదయమున పొలఁతిగుబ్బలచంద్ర -
కాంతము గరఁగినచొక్కపువిధమాయ
(||pallavi||)
sūḍaramma nichchagŏttasŏdyama(mu?)lāya
veḍuga vibhuniseda vĕllavirulāya
(||sūḍa||)
adanu virahaveḽa aṁdabum̐gurulu jāri
adivanŏsalibaim̐ dūlāḍam̐gānu
sadināsigamaneḍi saṁpĕṁgabūdāvi som̐ki
adighorabalulu tūlāḍinayaṭlāya
(||sūḍa||)
ām̐palega padigaḍa kaṁgana yalabudoḍa
yebuna mĕllamĕllanĕ yem̐gam̐gānu
sebaṭṭi nĕnnaḍimisiṁhabugāligim̐ gari
kebuna nem̐gusu naligeḍividhamāya
(||sūḍa||)
yiṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕduruga vachchi
kāṁtam̐ gūḍam̐ga radim̐ garam̐gam̐gānu
pŏṁtam̐ jaṁdrodayamuna pŏlam̐tigubbalasaṁdra -
kāṁtamu garam̐ginasŏkkabuvidhamāya