చూడనే పిన్నవుగాని సుద్దులెన్నైనాఁ గలవు
(॥పల్లవి॥)
చూడనే పిన్నవుగాని సుద్దులెన్నైనాఁ గలవు
యీడువచ్చు నిద్దరికి నిఁకనేల సిగ్గులు
(॥చూడ॥)
మొగము చూపవే ముచ్చట దీరఁ బతికి
నగవే వొకమాఁటు నయగారాన
జిగురువంటివలపు చిత్తములో నంటుకొనె
ఇగిరించె జవ్వనము ఇఁకనేల సిగ్గులు
(॥చూడ॥)
కదిసి మాటాడవే కందువలు సోఁకఁగ
గుదిగొనఁ జెనకవే గుబ్బల నొత్తి
ముదరుఁ దేనియ లుబ్బి మోవిపై లుప్పలుగట్టె
యెదిరించెఁ దరితీపు లిఁకనేల సిగ్గులు
(॥చూడ॥)
మొక్కవే శ్రీవేంకటేశుముందర నిలిచి నీవు
అక్కరఁ గాఁగిలించవే యలమేల్మంగ
మిక్కుటపురతులెల్లా మేనితోనే పెనగొనె
యిక్కువలు గరఁగెను యిఁకనేల సిగ్గులు
(||pallavi||)
sūḍane pinnavugāni suddulĕnnainām̐ galavu
yīḍuvachchu niddarigi nim̐kanela siggulu
(||sūḍa||)
mŏgamu sūbave muchchaḍa dīram̐ badigi
nagave vŏgamām̐ṭu nayagārāna
jiguruvaṁṭivalabu sittamulo naṁṭugŏnĕ
igiriṁchĕ javvanamu im̐kanela siggulu
(||sūḍa||)
kadisi māḍāḍave kaṁduvalu som̐kam̐ga
gudigŏnam̐ jĕnagave gubbala nŏtti
mudarum̐ deniya lubbi movibai luppalugaṭṭĕ
yĕdiriṁchĕm̐ daridību lim̐kanela siggulu
(||sūḍa||)
mŏkkave śhrīveṁkaḍeśhumuṁdara nilisi nīvu
akkaram̐ gām̐giliṁchave yalamelmaṁga
mikkuḍaburadulĕllā menidone pĕnagŏnĕ
yikkuvalu garam̐gĕnu yim̐kanela siggulu