Soodamugaa nemdu nee sugudadanamulellaa

చూతముగా నేఁడు నీ సుగుడతనములెల్లా
Language

(॥పల్లవి॥)
చూతముగా నేఁడు నీ సుగుడతనములెల్లా
యేతులకు నెంచితే వూరెల్లా గొల్లెతలే

(॥చూత॥)
వంతుల కింతలు నీపై వలపులు చల్లేరు
యెంతని మోచేవయ్య ఇప్పుడు నీవు
దొంతులు వెట్టే రప్పటి దొడ్డదొడ్డకుచుముల
అంతటి కీవురమెట్టు ఆనుకొనీనో

(॥చూత॥)
మోవులెత్తుకొ నిందరు మోవితేనె లొసఁగేరు
యేమి సేసేవయ్య నీవు యీఁతామోఁతలు
వాములు వేసేరు నీపై వడిగా రేపల్లెవారు
నోముచు నీతురుమెట్టు వోరుచుకొనీనో

(॥చూత॥)
సొలసి కన్నుఁగలువ చూపులనుఁ బూజించేరు
కొలఁదెట్టు పెట్టేవయ్య కుప్పలాయను
అలమి నిన్నుఁగూడి అందరముఁ బిలిచేము
వెలయ శ్రీవేంకటేశ వీను లెట్టు వొందీనో

(||pallavi||)
sūdamugā nem̐ḍu nī suguḍadanamulĕllā
yedulagu nĕṁchide vūrĕllā gŏllĕdale

(||sūda||)
vaṁtula kiṁtalu nībai valabulu salleru
yĕṁtani mosevayya ippuḍu nīvu
dŏṁtulu vĕṭṭe rappaḍi dŏḍḍadŏḍḍagusumula
aṁtaḍi kīvuramĕṭṭu ānugŏnīno

(||sūda||)
movulĕttugŏ niṁdaru movidenĕ lŏsam̐geru
yemi sesevayya nīvu yīm̐tāmom̐talu
vāmulu veseru nībai vaḍigā reballĕvāru
nomusu nīdurumĕṭṭu vorusugŏnīno

(||sūda||)
sŏlasi kannum̐galuva sūbulanum̐ būjiṁcheru
kŏlam̐dĕṭṭu pĕṭṭevayya kuppalāyanu
alami ninnum̐gūḍi aṁdaramum̐ bilisemu
vĕlaya śhrīveṁkaḍeśha vīnu lĕṭṭu vŏṁdīno