Soodamu neeyaggaliga soodi nimkaa nemtagaddo

చూతము నీయగ్గలిక సూటి నింకా నెంతగద్దో
Language

(॥పల్లవి॥)
చూతము నీయగ్గలిక సూటి నింకా నెంతగద్దో
కాతరించేవు వలపు గంపఁ బోసుకోవే

(॥చత॥)
మగిడిమగిడి సారె మగని నేమిచూచేవే
జిగిమించ లోలోనే సిగ్గువడక
నగేవారి నెఱఁగవు నలుదిక్కులానిన్ను
మిగులా బత్తిగలితే మెడఁగట్టుకొవే

(॥చత॥)
యేపొద్దు నిలుచుకొని యెదుట నేముందానవే
ఆఁపరాని తమితోడ నలపులేక
పూఁసవయసుదానవు బుద్దిచెప్పేవారు లేరా
వొపితే నీవాతని వొడిఁబెట్టుకొనవే

(॥చత॥)
యిట్టె శ్రీవేంకటేశుతో నెన్నిమాఁటలాడేవే
గట్టువాయవై నోరఁ గాయవేయక
మట్టుమీరి యలమేలుమంగనైననన్నుఁ గూడె
నెట్టనఁ జుట్టమవైతే నెత్తి కెత్తుకొవే

(||pallavi||)
sūdamu nīyaggaliga sūḍi niṁkā nĕṁtagaddo
kādariṁchevu valabu gaṁpam̐ bosugove

(||sada||)
magiḍimagiḍi sārĕ magani nemisūseve
jigimiṁcha lolone sigguvaḍaga
nagevāri nĕṟam̐gavu naludikkulāninnu
migulā battigalide mĕḍam̐gaṭṭugŏve

(||sada||)
yebŏddu nilusugŏni yĕduḍa nemuṁdānave
ām̐parāni tamidoḍa nalabulega
pūm̐savayasudānavu buddisĕppevāru lerā
vŏbide nīvādani vŏḍim̐bĕṭṭugŏnave

(||sada||)
yiṭṭĕ śhrīveṁkaḍeśhudo nĕnnimām̐ṭalāḍeve
gaṭṭuvāyavai noram̐ gāyaveyaga
maṭṭumīri yalamelumaṁganainanannum̐ gūḍĕ
nĕṭṭanam̐ juṭṭamavaide nĕtti kĕttugŏve