Soodamjooda nidi vatti joli gaaga | nee

చూడఁజూడ నిది వట్టి జోలి గాక । నీ
Language

(॥పల్లవి॥)
చూడఁజూడ నిది వట్టి జోలి గాక । నీ-
జాడ లివి మంచివైతే సమ్మతులుగావా

(॥చూడ॥)
లాగుల నింతటనుఁ దెల్లనివెల్లాఁ బాలైతే
యేగతి భూమిలో నే మేమి గాదు
ఆగతినే పెట్టుకొన్న ఆనలే నిజమైతే
వేగుదాఁకా మరునికి వేదములై యుండవా

(॥చూడ॥)
సారెకు దిక్కులనుఁ బచ్చనిదెల్లాఁ బైఁడౌతే
కోరి యవి యెంత సేసుకొనరాదు
కూరిమితో నీవొళ్లిగుణములే చక్కనైతే
సారపువలపులకు సాకిరులై వుండవా

(॥చూడ॥)
పొందినకాఁగిటిలోనిపులకలే పూవులైతే
చెందిన శ్రీవేంకటేశ చెప్పరాదు
కుందణపుఁగుత్తికలో కునుకునే కతలైతే
పందెపురతులకివి పచ్చియై నిలువవా

(||pallavi||)
sūḍam̐jūḍa nidi vaṭṭi joli gāga | nī-
jāḍa livi maṁchivaide sammadulugāvā

(||sūḍa||)
lāgula niṁtaḍanum̐ dĕllanivĕllām̐ bālaide
yegadi bhūmilo ne memi gādu
āgadine pĕṭṭugŏnna ānale nijamaide
vegudām̐kā marunigi vedamulai yuṁḍavā

(||sūḍa||)
sārĕgu dikkulanum̐ bachchanidĕllām̐ baim̐ḍaude
kori yavi yĕṁta sesugŏnarādu
kūrimido nīvŏḽliguṇamule sakkanaide
sārabuvalabulagu sāgirulai vuṁḍavā

(||sūḍa||)
pŏṁdinagām̐giḍilonibulagale pūvulaide
sĕṁdina śhrīveṁkaḍeśha sĕpparādu
kuṁdaṇabum̐guttigalo kunugune kadalaide
paṁdĕburadulagivi pachchiyai niluvavā