Soodam joodam gottalaaya sudadibhaavamu nemdu

చూడఁ జూడఁ గొత్తలాయ సుదతిభావము నేఁడు
Language

(॥పల్లవి॥)
చూడఁ జూడఁ గొత్తలాయ సుదతిభావము నేఁడు
కూడి నీ కూటమికిఁ గొలకొల నవ్వెను

(॥చూడఁ॥)
పక్కన నన్నుఁ జూచి పడఁతి శిరసు వంచె
చెక్కిటఁ జేయిడుకొని సిగ్గువడెను
జక్కన చన్నులమీఁద జారినపయ్యెదకొంగు
అక్కున నదుముకొని యంతలోనో నవ్వెను

(॥చూడఁ॥)
ఆలించి నీమాఁట విని యాసతోడ ముక్కుఁమీద
వేలువెట్టుకొనుచు నివ్వెరగందెను
మేలిమితురుము వీడి మెడమీఁద గమ్ముకోఁగా
కేలఁ జక్క నొక్క నొత్తుకొంటా కిలకిల నవ్వెను

(॥చూడఁ॥)
కొచ్చి నీవద్దఁ గూచుండి గొబ్బనఁ జెమరించఁగా
మచ్చికఁ గరఁగుకొంటా మదిఁజొక్కెను
యిచ్చట శ్రీవేంకటేశ పచ్చిచేఁత సేయుగాని
పచ్చడము గప్పకొని పకపక నవ్వెను

(||pallavi||)
sūḍam̐ jūḍam̐ gŏttalāya sudadibhāvamu nem̐ḍu
kūḍi nī kūḍamigim̐ gŏlagŏla navvĕnu

(||sūḍam̐||)
pakkana nannum̐ jūsi paḍam̐ti śhirasu vaṁchĕ
sĕkkiḍam̐ jeyiḍugŏni sigguvaḍĕnu
jakkana sannulamīm̐da jārinabayyĕdagŏṁgu
akkuna nadumugŏni yaṁtalono navvĕnu

(||sūḍam̐||)
āliṁchi nīmām̐ṭa vini yāsadoḍa mukkum̐mīda
veluvĕṭṭugŏnusu nivvĕragaṁdĕnu
melimidurumu vīḍi mĕḍamīm̐da gammugom̐gā
kelam̐ jakka nŏkka nŏttugŏṁṭā kilagila navvĕnu

(||sūḍam̐||)
kŏchchi nīvaddam̐ gūsuṁḍi gŏbbanam̐ jĕmariṁcham̐gā
machchigam̐ garam̐gugŏṁṭā madim̐jŏkkĕnu
yichchaḍa śhrīveṁkaḍeśha pachchisem̐ta seyugāni
pachchaḍamu gappagŏni pagabaga navvĕnu