చూడఁ బిన్నవాఁడుగాని జూటుఁదనాల నెక్కుఁడు
(॥పల్లవి॥)
చూడఁ బిన్నవాఁడుగాని జూటుఁదనాల నెక్కుఁడు
యేడ చూచినాఁ దాను యీ విట్ఠలుడే
(॥చూడ॥)
గోవులలో విహరించేగోవిందుఁడు పెక్కు-
వావుల గోపికలకు వల్లభుఁడు
చేవమీరి ముద్దుల శ్రీకృష్ణుఁడు
యేవల్లఁ జూచినాను యీవిట్ఠలుఁడే
(॥చూడ॥)
రాసక్రీడలలోని రాజీవాక్షుఁడు
ఆసఁ బదారువేలఁ బెండ్లాడినవాఁడు
బాసతో రుక్మిణీసత్యభామసమేతుఁడు
యీసుద్దుల వెలసీ నీవిట్ఠలుఁడే
(॥చూడ॥)
వింతమధురాంగనలవేడుకకాఁడు
చెంతఁ గొలనిసతుల సిగ్గులవాఁడు
కాంత లక్ష్మీపతి శ్రీవేంకటేశ్వరుఁడు
యింతా వినోదించీ నీవిట్ఠలుఁడే
(||pallavi||)
sūḍam̐ binnavām̐ḍugāni jūḍum̐danāla nĕkkum̐ḍu
yeḍa sūsinām̐ dānu yī viṭṭhaluḍe
(||sūḍa||)
govulalo vihariṁchegoviṁdum̐ḍu pĕkku-
vāvula gobigalagu vallabhum̐ḍu
sevamīri muddula śhrīkṛṣhṇum̐ḍu
yevallam̐ jūsinānu yīviṭṭhalum̐ḍe
(||sūḍa||)
rāsakrīḍalaloni rājīvākṣhum̐ḍu
āsam̐ badāruvelam̐ bĕṁḍlāḍinavām̐ḍu
bāsado rukmiṇīsatyabhāmasamedum̐ḍu
yīsuddula vĕlasī nīviṭṭhalum̐ḍe
(||sūḍa||)
viṁtamadhurāṁganalaveḍugagām̐ḍu
sĕṁtam̐ gŏlanisadula siggulavām̐ḍu
kāṁta lakṣhmībadi śhrīveṁkaḍeśhvarum̐ḍu
yiṁtā vinodiṁchī nīviṭṭhalum̐ḍe