Soodam basibaalagaani joodugadammaa | taa

చూడఁ బసిబాలగాని జూటుగదమ్మా । తా
Language

(॥పల్లవి॥)
చూడఁ బసిబాలగాని జూటుగదమ్మా । తా-
నాడినట్టె ఆడకుంటే నగ్గలమయ్యీని

(॥చూడ॥)
కొట్టలేదు తిట్టలేదు కూరిమితోఁ దనచెక్కు
ముట్టితేనే యేడిచీని మొఱలువెట్టి
యెట్టిచిన్నబిడ్డఁడమ్మ యెంత యెత్తుకొన్నమానఁ-
డట్టె యంతకంతకు సగ్గలమయ్యీని

(॥చూడ॥)
అద్దలించఁ జేయుఁ దనయంగదూళిఁ దుడిచిన
పొద్దువోక నేలబడి పొరలాడీని
వుద్దండీఁడు గదనమ్మ వుట్టిపాలలోనఁ బాద-
మద్దకుమంటేనే యగ్గలమయ్యీని

(॥చూడ॥)
అంగడి నెఁదైనఁ దా నాడివచ్చి పయ్యద-
కొంగుఁ గప్పుమని మాతో గువిశాడీని
జంగిలై శ్రీవేంకటేశ్వరుడ యెంగిలిముద్దు-
లంగవించ నొల్లమంటే అగ్గలమయ్యీని

(||pallavi||)
sūḍam̐ basibālagāni jūḍugadammā | tā-
nāḍinaṭṭĕ āḍaguṁṭe naggalamayyīni

(||sūḍa||)
kŏṭṭaledu tiṭṭaledu kūrimidom̐ danasĕkku
muṭṭidene yeḍisīni mŏṟaluvĕṭṭi
yĕṭṭisinnabiḍḍam̐ḍamma yĕṁta yĕttugŏnnamānam̐-
ḍaṭṭĕ yaṁtagaṁtagu saggalamayyīni

(||sūḍa||)
addaliṁcham̐ jeyum̐ danayaṁgadūḽim̐ duḍisina
pŏdduvoga nelabaḍi pŏralāḍīni
vuddaṁḍīm̐ḍu gadanamma vuṭṭibālalonam̐ bāda-
maddagumaṁṭene yaggalamayyīni

(||sūḍa||)
aṁgaḍi nĕm̐dainam̐ dā nāḍivachchi payyada-
kŏṁgum̐ gappumani mādo guviśhāḍīni
jaṁgilai śhrīveṁkaḍeśhvaruḍa yĕṁgilimuddu-
laṁgaviṁcha nŏllamaṁṭe aggalamayyīni