Soodagadavamma sokki yela tamgee

సూడగదవమ్మ సొక్కి యేల తంగీ
Language

(॥పల్లవి॥)
సూడగదవమ్మ సొక్కి యేల తంగీ
జేడుఁ గోనేటిసెల మకరతను

(॥సూడ॥)
కూపెట్టుసదువులకొనలపేరిటివాడు
పూపకొడుకు గని బూము లేలేటివాడు
సాపనీటికిందిపతి సంకబెట్టుక
తీపులు తిరుమలదేవరైనాఁడే

(॥సూడ॥)
పుల్ల వెలుగులోనిబోనపుతరివాడు
తెల్లనిమెఱుఁగుల తెరలఁ దేలేటివాడు
గుల్ల సేతఁబట్టి కొండపై నిలుసుండి
పల్లెవాటువేసి వరము లిచ్చెను

(॥సూడ॥)
సీఁకటిమైవాఁడు సీలపలపువాఁడు
ఆకుదండలే తలనటుమోసినాడు
దీకొని పాముపై తేలి వుండినవాఁడు
యీకడ శ్రీవేంకటేశు డైనాఁడె

(||pallavi||)
sūḍagadavamma sŏkki yela taṁgī
jeḍum̐ goneḍisĕla magaradanu

(||sūḍa||)
kūbĕṭṭusaduvulagŏnalaberiḍivāḍu
pūbagŏḍugu gani būmu leleḍivāḍu
sābanīḍigiṁdibadi saṁkabĕṭṭuga
tībulu tirumaladevarainām̐ḍe

(||sūḍa||)
pulla vĕlugulonibonabudarivāḍu
tĕllanimĕṟum̐gula tĕralam̐ deleḍivāḍu
gulla sedam̐baṭṭi kŏṁḍabai nilusuṁḍi
pallĕvāḍuvesi varamu lichchĕnu

(||sūḍa||)
sīm̐kaḍimaivām̐ḍu sīlabalabuvām̐ḍu
āgudaṁḍale talanaḍumosināḍu
dīgŏni pāmubai teli vuṁḍinavām̐ḍu
yīgaḍa śhrīveṁkaḍeśhu ḍainām̐ḍĕ