చూపవయ్యా నాకెపెను సోద్యమయ్యీని
(॥పల్లవి॥)
చూపవయ్యా నాకెపెను సోద్యమయ్యీని
మోపుగట్టీ వినయాలు మోహమెంతగలదో
(॥చూప॥)
తెరమఱఁగున నుండి తియ్యని మాట లాడి
తరితీపు సేసీని తా నెంతటిదో
విరులు నీపైఁ జల్లి వేడుక నవ్వులు నవ్వి
తరపువెట్టీ వలపు తగ నెంత నేర్చెనో
(॥చూప॥)
పానుపుపైఁ బవళించి పదనుగా సన్నసేసి
నానఁ బెట్టీఁ దమకము నను పెట్టిరో
సోనలచూపులు చూచి చొక్కల మొక్కులు మొక్కి
సానఁబట్టీఁ గొనగోళ్లు చల మెంతగలదో
(॥చూప॥)
బలిమిగాఁ గాఁగిలించి భావము గరఁగఁజేసి
మొలపించీఁ బులకలు ముదమెట్టిదో
అలమె శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
వెలయించె నీకరుణ వినోద మెంతటిదో
(||pallavi||)
sūbavayyā nāgĕbĕnu sodyamayyīni
mobugaṭṭī vinayālu mohamĕṁtagalado
(||sūba||)
tĕramaṟam̐guna nuṁḍi tiyyani māḍa lāḍi
taridību sesīni tā nĕṁtaḍido
virulu nībaim̐ jalli veḍuga navvulu navvi
tarabuvĕṭṭī valabu taga nĕṁta nersĕno
(||sūba||)
pānububaim̐ bavaḽiṁchi padanugā sannasesi
nānam̐ bĕṭṭīm̐ damagamu nanu pĕṭṭiro
sonalasūbulu sūsi sŏkkala mŏkkulu mŏkki
sānam̐baṭṭīm̐ gŏnagoḽlu sala mĕṁtagalado
(||sūba||)
balimigām̐ gām̐giliṁchi bhāvamu garam̐gam̐jesi
mŏlabiṁchīm̐ bulagalu mudamĕṭṭido
alamĕ śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
vĕlayiṁchĕ nīgaruṇa vinoda mĕṁtaḍido