చూపవయ్య నా కాపెను సుదతి యెటువంటిదో
(॥పల్లవి॥)
చూపవయ్య నా కాపెను సుదతి యెటువంటిదో
పైపై తమక మింత పనిగొనవలదా
(॥చూప॥)
యేపున నీ నిమ్మపండు యెవ్వతె కానుకిచ్చెనో
ఆపెమారుగాఁ జూచే వప్పటినుండి
మోపుచు కన్నుల మరమున కద్దుకొనే విదె
యేపొద్దుఁ దరితీపులు యిట్టుండవలదా
(॥చూప॥)
యీవేళఁ దామెరపువ్వు యెందు దొరకెనో ఆపె
చే వట్టినట్టు పట్టి చే వదలవు
తావి చూచే వప్పటిని తలపై నిడుకొనేవు
పూవువంటివల పింత పోదిసేయవలదా
(॥చూప॥)
వలయపుభరణు లేవల్ల నీకుఁగలిగెనో
కలికిచన్నులమారు కాఁగిలించేవు
అలరి శ్రీవేంకటేశ అప్పటి నన్నేలితివి
కలపుకో లిటువలెఁ గలుగఁగవలదా
(||pallavi||)
sūbavayya nā kābĕnu sudadi yĕḍuvaṁṭido
paibai tamaga miṁta panigŏnavaladā
(||sūba||)
yebuna nī nimmabaṁḍu yĕvvadĕ kānugichchĕno
ābĕmārugām̐ jūse vappaḍinuṁḍi
mobusu kannula maramuna kaddugŏne vidĕ
yebŏddum̐ daridībulu yiṭṭuṁḍavaladā
(||sūba||)
yīveḽam̐ dāmĕrabuvvu yĕṁdu dŏragĕno ābĕ
se vaṭṭinaṭṭu paṭṭi se vadalavu
tāvi sūse vappaḍini talabai niḍugŏnevu
pūvuvaṁṭivala piṁta podiseyavaladā
(||sūba||)
valayabubharaṇu levalla nīgum̐galigĕno
kaligisannulamāru kām̐giliṁchevu
alari śhrīveṁkaḍeśha appaḍi nannelidivi
kalabugo liḍuvalĕm̐ galugam̐gavaladā