(॥పల్లవి॥)
సొలయక మలయక సోఁకనాడక
వలపులే చల్లి కైవశము సేసుకోవే
(॥సొల॥)
ప్రియములు చెప్పితేను బెరసి మతి గరఁగు
నయములు నెరపితే నమ్మిక వుట్టు
దయవుట్టు మెలఁగితే తగులు నాదరింపులు
క్రియతో నాతని రతికేలికి బిలువవే
(॥సొల॥)
చెప్పినట్టె సేసితేను చేఁతలెల్లా నీడేరు
వొప్పుగా మాఁటాడితేను వొడఁబాటౌను
చిప్పిల నవ్వు నవ్వతే చెలఁగి వేడుక వుట్టు
యెప్పుడు నీ వితనికి నిచ్చకమే సేయవే
(॥సొల॥)
పాయక వద్ద నుండితే పాదుకొను మచ్చికలు
చాయ దప్పక కూడితీ సంతోసాలౌను
యీయెడ శ్రీవేంకటేశుఁ డిన్నీటా నిన్ను మన్నించె
సేయఁగల సేవలెల్లాఁ జేసి మెప్పించకోవే
(||pallavi||)
sŏlayaga malayaga som̐kanāḍaga
valabule salli kaivaśhamu sesugove
(||sŏla||)
priyamulu sĕppidenu bĕrasi madi garam̐gu
nayamulu nĕrabide nammiga vuṭṭu
dayavuṭṭu mĕlam̐gide tagulu nādariṁpulu
kriyado nādani radigeligi biluvave
(||sŏla||)
sĕppinaṭṭĕ sesidenu sem̐talĕllā nīḍeru
vŏppugā mām̐ṭāḍidenu vŏḍam̐bāḍaunu
sippila navvu navvade sĕlam̐gi veḍuga vuṭṭu
yĕppuḍu nī vidanigi nichchagame seyave
(||sŏla||)
pāyaga vadda nuṁḍide pādugŏnu machchigalu
sāya dappaga kūḍidī saṁtosālaunu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍinnīḍā ninnu manniṁchĕ
seyam̐gala sevalĕllām̐ jesi mĕppiṁchagove