Sokkulam bettee nemdu soodave taanu

చొక్కులఁ బెట్టీ నేఁడు చూడవే తాను
Language

(॥పల్లవి॥)
చొక్కులఁ బెట్టీ నేఁడు చూడవే తాను
పక్కన నిందరిలోన బయట వేతునా

(॥చొక్కు॥)
తను నేమో అంటినంటా తారుకాణించుమనీని
వెనకటిసుద్ది వెల్లవిరిసేతునా
కొనచూపులఁజూచితే కొంగువట్టి పెనఁగీని
పనుపడ్డతనచేఁత వచ్చి సేతునా

(॥చొక్కు॥)
వొడి వట్టితినంటాను వూరకే సోదనిచ్చీని
కడలేనిదొర తన్ను కాకుసేతునా
తడవి నవ్వితినంటా తగిలి యానవెట్టీని
అడఁకువ తనగుట్టు ఆరడిఁబెట్టుదానా

(॥చొక్కు॥)
అట్టె చేయి వట్టితేను అడియాలా లిచ్చీని
రట్టుసేసి తన్ను రచ్చ నిట్టె వేతునా
యెట్టైన శ్రీవేంకటేశుఁ డింతలో నన్నేలినాఁడు
బెట్టి తనమోవియంతా పిప్పిసేతునా

(||pallavi||)
sŏkkulam̐ bĕṭṭī nem̐ḍu sūḍave tānu
pakkana niṁdarilona bayaḍa vedunā

(||sŏkku||)
tanu nemo aṁṭinaṁṭā tārugāṇiṁchumanīni
vĕnagaḍisuddi vĕllavirisedunā
kŏnasūbulam̐jūside kŏṁguvaṭṭi pĕnam̐gīni
panubaḍḍadanasem̐ta vachchi sedunā

(||sŏkku||)
vŏḍi vaṭṭidinaṁṭānu vūrage sodanichchīni
kaḍalenidŏra tannu kāgusedunā
taḍavi navvidinaṁṭā tagili yānavĕṭṭīni
aḍam̐kuva tanaguṭṭu āraḍim̐bĕṭṭudānā

(||sŏkku||)
aṭṭĕ seyi vaṭṭidenu aḍiyālā lichchīni
raṭṭusesi tannu rachcha niṭṭĕ vedunā
yĕṭṭaina śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannelinām̐ḍu
bĕṭṭi tanamoviyaṁtā pippisedunā