పల్లవి:
సొగసు చూడ తరమా...
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా...
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లో
ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
సిందులేసే సూడావమ్మ
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా
హా.. సొగసు చూడతరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ
చరణం 1:
ఓ చల్లగాలి.. ఆ నింగి దాటి
ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలి.. నీ ఒళ్ళో వాలి
నా ప్రేమ ఊసులాడే నీవా
అలనురుగుల పైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్నా మధురము కాదా
ప్రేమ గాధ వినవా
సొగసు చూడతరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ
చరణం 2:
ఉమ్మ్ డోలారే డోలా.. డోలారే డోలా
మోగింది చూడు గట్టి మేళా
బుగ్గే కందేలా.. సిగ్గే పడేలా
నాకొచ్చేనమ్మ పెళ్లి కళా
మబ్బు పరుపుల మాటు
మెరుపుల మేన పంపెనమ్మా వానా
నన్ను వలచిన వాడు వరుడై రాగా
ఆదామరచి పోనా
సొగసు చూడతరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లో
ఉయ్యాలలూగే ప్రేమా..హోయ్
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
సిందులేసే సుడావమ్మ
వయసునాప తరమా హొ
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా