Sittamuraa vinnabamu sesemgaani

చిత్తమురా విన్నపము సేసేఁగాని
Language

(॥పల్లవి॥)
చిత్తమురా విన్నపము సేసేఁగాని
తత్తరించ కివ్వలికి దాఁటిరావయ్యా

(॥చిత్త॥)
వలపు లీఁతలబంటి వాసులు రొమ్ములబంటి
పొలసితే మాటలు పుక్కిటిబంటి
అలసి అవ్వలనుండి అడిగేవు మాగుట్టు
తలపోఁతయేరులు దాఁటిరావయ్యా

(॥చిత్త॥)
చింతలు చెక్కులబంటి సిగ్గులు పెందొళ్లబంటి
మంతనా లన్నియుఁ జీలమండలబంటి
బంతి నెదురురేవుల పైకొని లోఁతర సేవు
దంతపు మేడకు నిట్టె దాఁటిరావయ్యా

(॥చిత్త॥)
కూటమి చంకలబంటి కోరికె చన్నులబంటి
మూటగట్టు సరసాలు మొలబంటి
యీటున శ్రీవేంకటేశ యెనసి నన్ను మెచ్చేవు
తాటించి నీవిట్లానే దాఁటిరావయ్యా

(||pallavi||)
sittamurā vinnabamu sesem̐gāni
tattariṁcha kivvaligi dām̐ṭirāvayyā

(||sitta||)
valabu līm̐talabaṁṭi vāsulu rŏmmulabaṁṭi
pŏlaside māḍalu pukkiḍibaṁṭi
alasi avvalanuṁḍi aḍigevu māguṭṭu
talabom̐tayerulu dām̐ṭirāvayyā

(||sitta||)
siṁtalu sĕkkulabaṁṭi siggulu pĕṁdŏḽlabaṁṭi
maṁtanā lanniyum̐ jīlamaṁḍalabaṁṭi
baṁti nĕdururevula paigŏni lom̐tara sevu
daṁtabu meḍagu niṭṭĕ dām̐ṭirāvayyā

(||sitta||)
kūḍami saṁkalabaṁṭi korigĕ sannulabaṁṭi
mūḍagaṭṭu sarasālu mŏlabaṁṭi
yīḍuna śhrīveṁkaḍeśha yĕnasi nannu mĕchchevu
tāḍiṁchi nīviṭlāne dām̐ṭirāvayyā