చిత్తము రా విభునికి సేవసేయఁ గదవే
(॥పల్లవి॥)
చిత్తము రా విభునికి సేవసేయఁ గదవే
హత్తి యాతఁడే మన్నించీ నన్నిటాను చెలియా
(॥చిత్త॥)
మచ్చికతో మాఁటాడితే మనసు గరఁగుఁగాక
తచ్చి తచ్చి దూరితేను తమి రేఁగునా
మెచ్చి మెచ్చి పొగడితే మిక్కిలి వేడుకౌఁగాక
పచ్చిగా నేరా లెంచితే పైకొన సొగసునా
(॥చిత్త॥)
ననుపునఁ జెనకితే నవ్వ నిచ్చవుట్టుఁగాక
పెనఁగులాడఁగఁబోతేను ప్రియుము లౌనా
వినయాలే సేసితేను వింత రుతు లబ్బుఁగాక
గునిసి కొసరితేను కోరిక లీడేరునా
(॥చిత్త॥)
ఆసతోఁ జూచిన చూపు లాయములు సోఁకుఁగాక
వాసితో సిగ్గువడితే వహి కెక్కునా
సేసవెట్టి నిన్నుఁగూడె శ్రీవేంకటేశుఁడు నేఁడు
మూసిపెట్టితే వలపు మొదలనే దాఁగునా
(||pallavi||)
sittamu rā vibhunigi sevaseyam̐ gadave
hatti yādam̐ḍe manniṁchī nanniḍānu sĕliyā
(||sitta||)
machchigado mām̐ṭāḍide manasu garam̐gum̐gāga
tachchi tachchi dūridenu tami rem̐gunā
mĕchchi mĕchchi pŏgaḍide mikkili veḍugaum̐gāga
pachchigā nerā lĕṁchide paigŏna sŏgasunā
(||sitta||)
nanubunam̐ jĕnagide navva nichchavuṭṭum̐gāga
pĕnam̐gulāḍam̐gam̐bodenu priyumu launā
vinayāle sesidenu viṁta rudu labbum̐gāga
gunisi kŏsaridenu koriga līḍerunā
(||sitta||)
āsadom̐ jūsina sūbu lāyamulu som̐kum̐gāga
vāsido sigguvaḍide vahi kĕkkunā
sesavĕṭṭi ninnum̐gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu
mūsibĕṭṭide valabu mŏdalane dām̐gunā