Sittametto yeṟamganu seluvumda neegu

చిత్తమెట్టో యెఱఁగను చెలువుఁడ నీకు
Language

(॥పల్లవి॥)
చిత్తమెట్టో యెఱఁగను చెలువుఁడ నీకు
మెత్తనిమనసుదాన మిక్కిలి మోహింతును

(॥చిత్త॥)
వెలి నెవ్వతైనా నిన్ను వెంగెమాడి నవ్వుఁగాని
పొలసి నేనైతే నిన్నుఁ బొగడుదును
పొలయలుకఁ గొందరు పొంచి నిన్నెలయింతురు
కలఇకలనే వూడిగముసేతు నీకును

(॥చిత్త॥)
కాతరించినది నిన్నుఁ గన్నుల జంకించుఁగాని
చేతులెత్తి మొక్కుదును చేరి నేనైతే
యేతరివాండ్లు నిన్ను యెందుకైనాఁ బిలుతురు
యీతల నిల్లాలనై నీఇంట నే నుండుదును

(॥చిత్త॥)
చలమరైన దొకతె సాదించుఁగాని నిన్ను
పిలిచి ప్రియముసేతుఁ బ్రేమ నేనైతే
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అలర నేలితివి నిన్నన్నిటా నే మెత్తును

(||pallavi||)
sittamĕṭṭo yĕṟam̐ganu sĕluvum̐ḍa nīgu
mĕttanimanasudāna mikkili mohiṁtunu

(||sitta||)
vĕli nĕvvadainā ninnu vĕṁgĕmāḍi navvum̐gāni
pŏlasi nenaide ninnum̐ bŏgaḍudunu
pŏlayalugam̐ gŏṁdaru pŏṁchi ninnĕlayiṁturu
kala̮igalane vūḍigamusedu nīgunu

(||sitta||)
kādariṁchinadi ninnum̐ gannula jaṁkiṁchum̐gāni
sedulĕtti mŏkkudunu seri nenaide
yedarivāṁḍlu ninnu yĕṁdugainām̐ biluduru
yīdala nillālanai nīiṁṭa ne nuṁḍudunu

(||sitta||)
salamaraina dŏgadĕ sādiṁchum̐gāni ninnu
pilisi priyamusedum̐ brema nenaide
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
alara nelidivi ninnanniḍā ne mĕttunu