Sittagimchu maguvanu siggulu vadaga neevu

చిత్తగించు మగువను సిగ్గులు వడక నీవు
Language

(॥పల్లవి॥)
చిత్తగించు మగువను సిగ్గులు వడక నీవు
హత్తి బాగాలు చేతికి నంది యిచ్చీ నీకు

(॥చిత్త॥)
జక్కవ గుబ్బలమీఁద జారినపయ్యద తోడ
నిక్కి నిక్కి చూచీని నెలఁత నిన్ను
చెక్కెలఁ జెమటఁగారఁ జెంగలించుకొంటాను
యిక్కువ నుండి చేతులెత్తి మొక్కీ నీకు

(॥చిత్త॥)
మొలనూలు దిరిగిరా మోసేటి గంటలతోడ
లలి నీసేవలు సేసీ లలన యిదె
పెలకలు మేన నిండ బుసకొట్టు కొంటాను
పలుమారు నిట్టె విన్నపాలు సేసీ నీకు

(॥చిత్త॥)
కొప్పన నుండి రాలేటి గొజ్జంగ విరులతోడ
వొప్పగ నీతో నవ్వీ నువిద
నెప్పన శ్రీవేంకటేశ నీవింతలోఁ గూడఁగాను
చెప్పరాని తలఁపెల్లాఁ జెప్పి చూపీ నీకు

(||pallavi||)
sittagiṁchu maguvanu siggulu vaḍaga nīvu
hatti bāgālu sedigi naṁdi yichchī nīgu

(||sitta||)
jakkava gubbalamīm̐da jārinabayyada toḍa
nikki nikki sūsīni nĕlam̐ta ninnu
sĕkkĕlam̐ jĕmaḍam̐gāram̐ jĕṁgaliṁchugŏṁṭānu
yikkuva nuṁḍi sedulĕtti mŏkkī nīgu

(||sitta||)
mŏlanūlu dirigirā moseḍi gaṁṭaladoḍa
lali nīsevalu sesī lalana yidĕ
pĕlagalu mena niṁḍa busagŏṭṭu kŏṁṭānu
palumāru niṭṭĕ vinnabālu sesī nīgu

(||sitta||)
kŏppana nuṁḍi rāleḍi gŏjjaṁga viruladoḍa
vŏppaga nīdo navvī nuvida
nĕppana śhrīveṁkaḍeśha nīviṁtalom̐ gūḍam̐gānu
sĕpparāni talam̐pĕllām̐ jĕppi sūbī nīgu