Sittagimchavayyaa yemi siggulu vadevu neevu

చిత్తగించవయ్యా యేమి సిగ్గులు వడేవు నీవు
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్యా యేమి సిగ్గులు వడేవు నీవు
తత్తరించీఁ దమకము తవ్వితవ్వి యిపుడు

(॥చిత్త॥)
పువ్వు వంటి జవ్వనము పొలఁతి మేనఁ బెట్టుక
వువ్విళ్ళూరీ నీయెదుట నుండి యిదివొ
నవ్వులు సెలవులను నానవేసి నానవేసి
కువ్వవోసీ వలపులు గురుతుమాటలను

(॥చిత్త॥)
కడలేని కాంక్షలను కన్నులలో నించుక
పడఁతి నీమోము చూచీఁ బలుమారును
గుడిగొ న్నసరసాలు కొనగోర నించి నించి
చిడిముడి మూటగట్టీ చిమ్ముఁ జెనకులను

(॥చిత్త॥)
కందువైన రతులెల్లా కాఁగిటలో నిలుపుక
చిందీ మోవితేనెలు చేరి నీవద్ద
పొంది శ్రీవేంకటేశ భోగములఁ గూడికూడి
అందిచ్చీ నీకు సంతోసా లాసలాసలను

(||pallavi||)
sittagiṁchavayyā yemi siggulu vaḍevu nīvu
tattariṁchīm̐ damagamu tavvidavvi yibuḍu

(||sitta||)
puvvu vaṁṭi javvanamu pŏlam̐ti menam̐ bĕṭṭuga
vuvviḽḽūrī nīyĕduḍa nuṁḍi yidivŏ
navvulu sĕlavulanu nānavesi nānavesi
kuvvavosī valabulu gurudumāḍalanu

(||sitta||)
kaḍaleni kāṁkṣhalanu kannulalo niṁchuga
paḍam̐ti nīmomu sūsīm̐ balumārunu
guḍigŏ nnasarasālu kŏnagora niṁchi niṁchi
siḍimuḍi mūḍagaṭṭī simmum̐ jĕnagulanu

(||sitta||)
kaṁduvaina radulĕllā kām̐giḍalo nilubuga
siṁdī movidenĕlu seri nīvadda
pŏṁdi śhrīveṁkaḍeśha bhogamulam̐ gūḍigūḍi
aṁdichchī nīgu saṁtosā lāsalāsalanu