చిత్తగించవయ్యా నీవు సేసిన భాగ్యమిదివో
(॥పల్లవి॥)
చిత్తగించవయ్యా నీవు సేసిన భాగ్యమిదివో
కొత్తకొత్త సణఁగుల కొచ్చి చూచీని
(॥చిత్త॥)
చెలి నీకు విడెమిచ్చి సిగ్గుపడుతా నట్టె
మలసి తలవంచుక మాటలాడీని
అలిగినదీఁ గాదు ఆసలు విడువలేదు
చలివాయ వలపుల సాముసేసిని
(॥చిత్త॥)
కాంత నీకొలువుసేసి కంబముమాఁటున నుండి
కొంతగొంత కొంకుతోడ కుంచవేసీని
పంతము నెరపలేదు పైకొనక మానదు
చెంతలఁ దమకముతోఁ జిమ్మి రేఁగీని
(॥చిత్త॥)
తొయ్యలి నీసేవ సేసి దోమతెరలో నుండి
కయ్యములన్నియుఁ దీరఁ గాఁగిలించీని
గయ్యాళితనము లేదు కడు నవ్వకమానదు
యియ్యెడ శ్రీవేంకటేశ యిరవయ్యీని
(||pallavi||)
sittagiṁchavayyā nīvu sesina bhāgyamidivo
kŏttagŏtta saṇam̐gula kŏchchi sūsīni
(||sitta||)
sĕli nīgu viḍĕmichchi siggubaḍudā naṭṭĕ
malasi talavaṁchuga māḍalāḍīni
aliginadīm̐ gādu āsalu viḍuvaledu
salivāya valabula sāmusesini
(||sitta||)
kāṁta nīgŏluvusesi kaṁbamumām̐ṭuna nuṁḍi
kŏṁtagŏṁta kŏṁkudoḍa kuṁchavesīni
paṁtamu nĕrabaledu paigŏnaga mānadu
sĕṁtalam̐ damagamudom̐ jimmi rem̐gīni
(||sitta||)
tŏyyali nīseva sesi domadĕralo nuṁḍi
kayyamulanniyum̐ dīram̐ gām̐giliṁchīni
gayyāḽidanamu ledu kaḍu navvagamānadu
yiyyĕḍa śhrīveṁkaḍeśha yiravayyīni