Sittagimchavayya neegu siggulu vadamganela

చిత్తగించవయ్య నీకు సిగ్గులు వడఁగనేల
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్య నీకు సిగ్గులు వడఁగనేల
కొత్తగాను తనలోని కోరికెంత గలదో

(॥చిత్త॥)
వాలుకచూపులు నీపై వంచి మాటలాడీఁ జెల
తాలిమిలేని మనసుతమి యెట్టిదో
వేళగాచి విన్నవించీ వేసర దెంతెనాను
వాలియించి నీయెడకు వల పెటువంటిదో

(॥చిత్త॥)
చన్ను లొరయఁగను నీ సంగడిఁ గూచుండీఁ దాను
సన్నల నీతోడిరతిచవి యెట్టిదో
తన్నుఁదానె నవ్వునవ్వీ తనియఁదెంతైనాను
యిన్నిటా నీమీఁదటియేఁకట యేలాగుదో

(॥చిత్త॥)
గక్కనఁ బాదాలొత్తుతా కాఁగిలించీ నీ దేవుఁడు
వెక్కసమైన తన వేడు కెట్టిదో
యిక్కువ శ్రీవేంకటేశ యీకెను మన్నించితివి
మొక్కుతానే నెంచి మెచ్చీ ముదము బొందినదో

(||pallavi||)
sittagiṁchavayya nīgu siggulu vaḍam̐ganela
kŏttagānu tanaloni korigĕṁta galado

(||sitta||)
vālugasūbulu nībai vaṁchi māḍalāḍīm̐ jĕla
tālimileni manasudami yĕṭṭido
veḽagāsi vinnaviṁchī vesara dĕṁtĕnānu
vāliyiṁchi nīyĕḍagu vala pĕḍuvaṁṭido

(||sitta||)
sannu lŏrayam̐ganu nī saṁgaḍim̐ gūsuṁḍīm̐ dānu
sannala nīdoḍiradisavi yĕṭṭido
tannum̐dānĕ navvunavvī taniyam̐dĕṁtainānu
yinniḍā nīmīm̐daḍiyem̐kaḍa yelāgudo

(||sitta||)
gakkanam̐ bādālŏttudā kām̐giliṁchī nī devum̐ḍu
vĕkkasamaina tana veḍu kĕṭṭido
yikkuva śhrīveṁkaḍeśha yīgĕnu manniṁchidivi
mŏkkudāne nĕṁchi mĕchchī mudamu bŏṁdinado