Sittagimcharaadaa neeve seli yatlanunnado

చిత్తగించరాదా నీవే చెలి యట్లనున్నదో
Language

(॥పల్లవి॥)
చిత్తగించరాదా నీవే చెలి యట్లనున్నదో
కొత్తగా నే విన్నవించే గురుతు లేమున్నవి

(॥చిత్త॥)
తరుణీ నీకూటములు దలపోసి తలపోసి
శిరసువంపులతోడఁ జిమ్మిరేఁగెను
వరుస నీకొప్పువీడి వాసనకుఁ గడుఁజొక్కి
నిరతపుఁదమకా నివ్వెరగైవున్నది

(॥చిత్త॥)
నెమ్మదిఁ జిత్తరువులో నీరూపు చూచిచూచి
పమ్మినకోరికలలో పచ్చిదేరెను
తెమ్మలుగా నీసుద్దులు దిక్కులనెల్లా విని
వుమ్మగిలునట్టూర్పులు నుస్సురనీ నిపుడు

(॥చిత్త॥)
మన్నించఁగా నీకాఁగిట మర్మములు సోఁకి సోఁకి
చన్నులపై పులకల జడిసీ నిదె
యిన్నిటా శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నిన్ను మెచ్చి పొగడుతా నించుకొనెఁ గళలు

(||pallavi||)
sittagiṁcharādā nīve sĕli yaṭlanunnado
kŏttagā ne vinnaviṁche gurudu lemunnavi

(||sitta||)
taruṇī nīgūḍamulu dalabosi talabosi
śhirasuvaṁpuladoḍam̐ jimmirem̐gĕnu
varusa nīgŏppuvīḍi vāsanagum̐ gaḍum̐jŏkki
niradabum̐damagā nivvĕragaivunnadi

(||sitta||)
nĕmmadim̐ jittaruvulo nīrūbu sūsisūsi
pamminagorigalalo pachchiderĕnu
tĕmmalugā nīsuddulu dikkulanĕllā vini
vummagilunaṭṭūrbulu nussuranī nibuḍu

(||sitta||)
manniṁcham̐gā nīgām̐giḍa marmamulu som̐ki som̐ki
sannulabai pulagala jaḍisī nidĕ
yinniḍā śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
ninnu mĕchchi pŏgaḍudā niṁchugŏnĕm̐ gaḽalu