చిత్తగించరాదా ఈ చెలి భావము
(॥పల్లవి॥)
చిత్తగించరాదా ఈ చెలి భావము
బత్తిగలవారము చెప్పకపోదు నీకును
(॥చిత్త॥)
కలికి నీయింటికి రాఁగా యెదురుతాఁకై
తళుకున నిన్నుఁజూచి తలవంచెను
వెలలేని వలపుల విన్నపము సేయఁబోఇ
సెలవుల నవ్వుదేర సిగ్గువడె నదివో
(॥చిత్త॥)
అంగన కానుక నీకియ్యఁగ చేఇఁ జేఇ దాఁకి
చెంగటనే కళరేఁగి చెమరించెను
సంగతిగా నూడిగాలు సారెకుఁ జేయఁగ వచ్చి
అంగవించి పరవశమంది వున్న దిదివో
(॥చిత్త॥)
పొలఁతి సేసలు చల్లఁబూని మీకుఁ దారుకాణై
తలఁపు లొక్కటులై తమకించెను
యెలమి శ్రీ వేంకటేశ ఇప్పుడె నిన్నుఁగూడి
బలిమి నీతోఁ బెనఁగి పచ్చిదేరె నదివో
(||pallavi||)
sittagiṁcharādā ī sĕli bhāvamu
battigalavāramu sĕppagabodu nīgunu
(||sitta||)
kaligi nīyiṁṭigi rām̐gā yĕdurudām̐kai
taḽuguna ninnum̐jūsi talavaṁchĕnu
vĕlaleni valabula vinnabamu seyam̐boi
sĕlavula navvudera sigguvaḍĕ nadivo
(||sitta||)
aṁgana kānuga nīgiyyam̐ga seim̐ jei dām̐ki
sĕṁgaḍane kaḽarem̐gi sĕmariṁchĕnu
saṁgadigā nūḍigālu sārĕgum̐ jeyam̐ga vachchi
aṁgaviṁchi paravaśhamaṁdi vunna didivo
(||sitta||)
pŏlam̐ti sesalu sallam̐būni mīgum̐ dārugāṇai
talam̐pu lŏkkaḍulai tamagiṁchĕnu
yĕlami śhrī veṁkaḍeśha ippuḍĕ ninnum̐gūḍi
balimi nīdom̐ bĕnam̐gi pachchiderĕ nadivo