చిత్తానఁ బెట్టుకోవయ్యా సేసిన నా విన్నపము
(॥పల్లవి॥)
చిత్తానఁ బెట్టుకోవయ్యా సేసిన నా విన్నపము
సత్తుగ నన్నేలితివి జాణవు నీవౌదువు
(॥చిత్తా॥)
యెంతెంతచక్కదనాన నెక్కుడగా మెరసిన
కాంత గుణవంతురాలు గావలెను
వంతుకుఁ జూచితే నుప్పు వడిఁదెల్లనై యుండితే
సంతతము కప్పురము పాటివచ్చీనా
(॥చిత్తా॥)
నిడిగి మగువ యెంతనేరుపరియైనాను
మగని కిచ్చకురాలై మనవలెను
పొగరుగలుగుతుమ్మిపువ్వులెన్ని ముడిచినా
తగినజాజులవలె తావి యంటీనా
(॥చిత్తా॥)
సతి యెంత జవ్వనాన జడియుచునుండినాను
రతికేలిఁ జిత్తముఁ గరఁగించవలె
క్షితి నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడ
సతమై కొక్కెరలు హంసలఁ బోలీనా
(||pallavi||)
sittānam̐ bĕṭṭugovayyā sesina nā vinnabamu
sattuga nannelidivi jāṇavu nīvauduvu
(||sittā||)
yĕṁtĕṁtasakkadanāna nĕkkuḍagā mĕrasina
kāṁta guṇavaṁturālu gāvalĕnu
vaṁtugum̐ jūside nuppu vaḍim̐dĕllanai yuṁḍide
saṁtadamu kappuramu pāḍivachchīnā
(||sittā||)
niḍigi maguva yĕṁtanerubariyainānu
magani kichchagurālai manavalĕnu
pŏgarugalugudummibuvvulĕnni muḍisinā
taginajājulavalĕ tāvi yaṁṭīnā
(||sittā||)
sadi yĕṁta javvanāna jaḍiyusunuṁḍinānu
radigelim̐ jittamum̐ garam̐giṁchavalĕ
kṣhidi nalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa
sadamai kŏkkĕralu haṁsalam̐ bolīnā