చిత్తాన మఱవక యీ చెలి నిట్టె మన్నించు
(॥పల్లవి॥)
చిత్తాన మఱవక యీ చెలి నిట్టె మన్నించు
వొత్తి విన్నవించే మీపె కొత్తపెండ్లికూఁతురు
(॥చిత్తా॥)
సెలవుల నవ్వుదురు చేసన్నలు సేతురు
వలపులు చల్లుదురు వనితలు
అలతురు సొలతురు ఆయములంటుదురు
బలిమినెంతైనా నెగ్గుపట్టరాదు పతికి
(॥చిత్తా॥)
చనవులు మెరతురు జంకింతురు బొమ్మలను
కనుఁగవ చూపులు కాఁడింతురు
వెనఁగుదు వూరకైను బిగుతురు పంగింతురు
యెనసి యెంతైనా నేరాలెంచరాదు పతికి
(॥చిత్తా॥)
మందెమేళాన నుందురు మనసులుఁ గరతురు
కందువ రతికిఁ దీసి కాఁగిలింతురు
ఇందుముఖి నేలితివి ఇంతలో శ్రీవేంకటేశ
విందువలెఁ బాయకుండు వీడరాదు పతికి
(||pallavi||)
sittāna maṟavaga yī sĕli niṭṭĕ manniṁchu
vŏtti vinnaviṁche mībĕ kŏttabĕṁḍligūm̐turu
(||sittā||)
sĕlavula navvuduru sesannalu seduru
valabulu salluduru vanidalu
aladuru sŏladuru āyamulaṁṭuduru
baliminĕṁtainā nĕggubaṭṭarādu padigi
(||sittā||)
sanavulu mĕraduru jaṁkiṁturu bŏmmalanu
kanum̐gava sūbulu kām̐ḍiṁturu
vĕnam̐gudu vūragainu biguduru paṁgiṁturu
yĕnasi yĕṁtainā nerālĕṁcharādu padigi
(||sittā||)
maṁdĕmeḽāna nuṁduru manasulum̐ garaduru
kaṁduva radigim̐ dīsi kām̐giliṁturu
iṁdumukhi nelidivi iṁtalo śhrīveṁkaḍeśha
viṁduvalĕm̐ bāyaguṁḍu vīḍarādu padigi